BigTV English

Coolie Movie: కూలీ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్.. పెట్టింది మొత్తం వచ్చేసిందిగా!

Coolie Movie: కూలీ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్.. పెట్టింది మొత్తం వచ్చేసిందిగా!

Coolie Movie: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కూలి(Coolie). ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఇతర అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్లను కూడా జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎంత మొత్తంలో ఖర్చు పెట్టారు, ఫ్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఎంత మొత్తం రాబట్టారనే విషయానికి వస్తే…


ఈ సినిమా కోసం నిర్మాతలు ఇప్పటివరకు సుమారు 350 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇక ప్రమోషన్ల కోసం మరో రూ. 25 కోట్లు ఆదనంగా కేటాయించారు. దీంతో ఈ సినిమా కోసం నిర్మాతలు ఖర్చు చేసిన మొత్తం బడ్జెట్ రూ.375 కోట్లు. ఇందులో రజనీకాంత్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కేటాయించారని తెలుస్తోంది. ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో రజనీకాంత్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక డైరెక్టర్ లోకేష్ సైతం ఒక్కో సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా కోసం లోకేష్ 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.

నాన్ థియేట్రికల్ బిజినెస్…


ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే… ఓటీటీ రైట్స్ -130 కోట్లు, శాటిలైట్స్ రైట్స్ – 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ – 20 కోట్లు. ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఈ సినిమా ఏకంగా రూ.240 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ నుంచి కనీసం రూ. 135 కోట్లు రాబడితే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్తారనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఏమాత్రం టెన్షన్ పడే పని లేదని, థియేట్రికల్ బిజినెస్ మంచిగా జరిగి ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబడితే మొదటి వారంలోనే ఈ చిత్రం లాభాల బాటలో పయనిస్తుందని చెప్పాలి.

సేఫ్ జోన్ లో కూలీ..

ఇక చిరంజీవి జైలర్ సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా తర్వాత కూలి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక కూలి సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే మాత్రం ఈ సినిమా సేఫ్ జోన్ లోనే ఉందని స్పష్టమవుతుంది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×