Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. తాజాగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89,950 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,130 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
అమెరికా డాలర్ విలువ బలహీనపడడంతో.. బంగారం ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచడం, డిమాండ్‌ను బలోపేతం చేస్తుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు పెరిగాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నిపుణుల అంచనా ప్రకారం.. 2025 నాటికి బంగారం ధర ఔన్స్‌కు $3,500 దాటవచ్చు, దేశీయంగా తులం పసిడి ధర రూ.1 లక్ష మార్క్‌ను అధిగమించే అవకాశం ఉంది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గితే.. ధరల్లో స్వల్ప తగ్గుదలకు అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ ఒడిదొడుకులను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,950 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 130 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,130 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 130 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,280 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,130 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 130 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: మార్కెట్లోకి ఫేక్ బంగారం.. గుర్తించకపోతే బుక్కైపోతారు
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,11,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00, 000 వద్ద కొనసాగుతోంది.