Big Stories

Election Commission: ప్రధాని మోదీ, రాహుల్ కోడ్ ఉల్లంఘనపై ఈసీ విచారణ.. చర్యలుంటాయా..?

Election Commission Of India: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఇద్దరూ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు గుర్తించామని భారత ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. మోదీ ముస్లింలపై విరుచుకుపడుతుండగా, వారి పేరు చెప్పకుండా, ‘చొరబాటుదారులు’, ‘ఎక్కువ పిల్లలు ఉన్నవారు’ వంటి పదాలను ఉపయోగించారని.. రాహుల్ గాంధీ ‘పేదరికం పెరుగుదల’ గురించి తప్పుడు వాదనలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిర నేపథ్యంలో ఈసీ స్పందించింది.

- Advertisement -

బీజేపీ, కాంగ్రెస్ రెండూ కులం, మతం, భాష, కమ్యూనిటీ ఆధారంగా ద్వేషం, విభజనలకు కారణమవుతున్నాయని ఆరోపణలను లేవనెత్తాయి. మోదీ ప్రసంగాలపై వ్యాఖ్యానించడానికి ఎన్నికల కమిషన్ మొదట నిరాకరించగా, బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను కమిషన్ పరిశీలిస్తోందని’ వర్గాలు పీటీఐకి తెలిపాయి. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటలలోపు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

- Advertisement -

కాగా రాజస్థాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ముస్లింలను చొరబాటుదారులంటూ అనడంతో రాజకీయ దుమారమే రేగింది. ఆడబిడ్డల వద్ద ఉన్న బంగారాన్ని కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులకు పంచిపెడుతుందని మోదీ విరుచుకుపడ్డారు. గత ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో హిందూ-ముస్లిం అని ఎక్కడ రాసుందో తెలపాలని ఆ పార్టీ నేతలు సవాల్ విసిరారు. ప్రధాని మోదీ దేశంలో విద్వేష బీజాలు నాటుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ హిందూ- ముస్లిం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.

Also Read:  వై దిస్ విద్వేషం.. ప్రధాని నరేంద్రమోడీ వివాదస్పద వ్యాఖ్యలు..

అటు భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. అంతకుముందు రాహుల్.. ప్రధాని మోదీ పాలనలో పేదరికం పెరిగిందని ఆరోపించారు. ఇవి తప్పుడు వ్యాఖ్యలని బీజేపీ నేతలు రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

దీంతో ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీని ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News