BigTV English

Fahadh Faasil Interview: సినిమాలు చూడండి అని వారికి మనమెందుకు చెప్పాలి..

Fahadh Faasil Interview: సినిమాలు చూడండి అని వారికి మనమెందుకు చెప్పాలి..

Fahadh Faasil Sensational Comments on Movies: ఒక స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కొడుకుగా మలయాళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఫహాద్ ఫాజిల్. మొదట్లో అతని లుక్ మీద ఎంతోమంది కామెంట్స్ చేశారు. సరిగ్గా విజయాలు అందలేదు. అయినా కూడా ఫహాద్ నిరుత్సాహాపడలేదు. మెల్లగా హీరోగా సెటిల్అయ్యాడు. ఎవరు ఎంచుకొని కథలను ఎంచుకొని స్టార్ హీరోగా మారాడు. హీరోగానే చేయాలి అనే నియమం పెట్టుకోకుండా విలన్, సపోర్టింగ్ రోల్స్ లో ఏదైనా సరే పాత్రకు ప్రాధాన్యత ఉందా.. ? లేదా అనేది చూసుకొని సీనియాలు ఒప్పుకుంటూ మలయాళ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టడానికి ఈ హీరో కూడా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఆవేశం సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేసిన ఫహాద్ చాలా రేర్ గా ఇంటర్వ్యూలు ఇస్తాడు.


తాజాగా ఒక సినీ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహాద్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా ఓటిటీ గురించి, ప్రేక్షకుల గురించి, సినిమాల గురించి ఆయన చేసిన కామెంట్స్ వింటే.. నెటిజన్స్ కు దిమ్మతిరుగుతుంది. ప్రతి ఒక్క హీరో తమ సినిమాలు చూడండి అని ఎందుకు అడగాలి.. ప్రేక్షకులకు నచ్చితే సినిమా చూస్తారు.. నచ్చకపోతే చూడడం మానేస్తారు.. సినిమాలు చూడండి అని వారికి మనమెందుకు చెప్పాలి. నేను ఎప్పుడు ప్రేక్షకులను అలా బలవంతపెట్టను. సినిమా చూడమని చెప్పే హక్కు మనకు లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: Renu Desai: ఆ పార్టీకే నా సపోర్ట్.. డబ్బు తీసుకోకుండా చెప్తున్నా.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్


ఇక తనకు సినిమాల గురించి మాట్లాడం కన్నా సినిమాలు చేయడమే ఇష్టమని చెప్పిన ఫహాద్ సినిమా చూసాకా మా గురించి మాట్లాడుకోవడం మానేయండి. సినిమాను సినిమాలా చూడాలి.  సినిమా తరువాత చాలా జీవితం ఉంది. థియేటర్ నుంచి వచ్చాకా కొద్దిసేపు దాని గురించి చర్చించుకోండి పర్లేదు. ఇంటికి వెళ్ళాక కూడా అదే సినిమా గురించి మాట్లాడుకోవద్దు. మీ కుటుంబంతో హాయిగా గడపండి” అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఏ హీరో ఇలా మాట్లాడింది లేదు అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. త్వరలోనే ఫహాద్ పుష్ప 2 తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానున్నాడు . మరి ఈ సినిమాతో ఈ హీరో ఎలాంటి రికార్డ్ సృష్టిస్తాడో చూడాలి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×