Kannapa film : మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా(Kannappa Movie) మరొక 20 రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూనే మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒకవైపు మోహన్ బాబు(Mohan Babu) మరోవైపు మంచు విష్ణు ఇద్దరు కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇక కన్నప్ప సినిమా ఇటీవల కాలంలో భారీ స్థాయిలో వివాదాలలో చిక్కుకోవడం అలాగే ఈ సినిమాపై భారీగా విమర్శలు రావడంతో మంచు విష్ణు ఎప్పటికప్పుడు ఈ విమర్శలను ఖండిస్తూ వస్తున్నారు.
భారీ తారాగణం…
ఇదిలా ఉండగా కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూన్ 27వ తేదీ ఒకేసారి ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, మార్కెట్ పరంగా ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో కలిసి వచ్చే విధంగా ఇతర భాష సెలబ్రిటీలను కూడా భాగం చేశారు. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తప్పనిసరిగా రజనీకాంత్ (Rajinikanth)కూడా నటిస్తారని అందరూ భావించారు కానీ రజనీకాంత్ కు మాత్రం అవకాశం లేకుండా పోయింది.
రజనీ పాత్రకు ప్రాధాన్యత లేదా….
రజనీకాంత్ మంచు కుటుంబానికి అత్యంత సన్నిహితుడనే విషయం మనకు తెలిసినదే. ముఖ్యంగా మోహన్ బాబు రజనీకాంత్ గారి మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరి మధ్య ఒరేయ్, రారా,పోరా అని పిలుచుకొనే అంతా చనువు ఉంది. ఇక గతంలోకి మోహన్ బాబు రజనీకాంత్ ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రజనీకాంత్ తో ఇంత మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మంచు మోహన్ బాబు కన్నప్ప సినిమాలో తనని భాగం చేయకపోవడానికి కారణం ఏంటి అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలిగాయి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణుకి కూడా అదే ప్రశ్న ఎదురైంది.
"Although #Kannappa already has a star-studded cast, we still wanted #Rajinikanth garu to play an important role.
However, after discussing with the writers, we felt the role lacked depth and didn’t align well with the story. So, we decided to drop the idea."
– #VishnuManchu pic.twitter.com/yDnJBrml35
— Movies4u Official (@Movies4u_Officl) June 6, 2025
ఇక ఈ సినిమాలో రజనీకాంత్ గారిని తీసుకోకపోవటానికి కారణం మంచు విష్ణు తెలిపారు. కన్నప్ప సినిమాలో ఇప్పటికే స్టార్ సెలబ్రిటీలందరూ కూడా భాగం అయ్యారు అయితే రజనీకాంత్ గారిని కూడా ఈ సినిమాలో భాగం చేయాలని మేము కోరుకున్నాము. రజనీకాంత్ గారి కోసం ఈ సినిమాలో ఒక పాత్రను కథా రచయితతో చర్చించాము. ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, కథకు సరిగ్గా సెట్ అవ్వదు అనిపించడంతోనే రజినీకాంత్ గారిని ఈ సినిమాలో భాగం చేయలేదని, లేకపోతే రజనీకాంత్ గారిని కూడా ఈ సినిమాలో భాగం చేయాలని నేను నాన్న ఇద్దరం ఆలోచించామని మంచు విష్ణు ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఎన్నో అంచనాల నడుమ భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న కన్నప్ప మంచు విష్ణుకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.