BigTV English

Rajiniknath: తిరుపతి లడ్డూ వివాదం.. నన్ను క్షమించండి అన్న రజనీకాంత్

Rajiniknath: తిరుపతి లడ్డూ వివాదం.. నన్ను క్షమించండి అన్న రజనీకాంత్

Rajiniknath: తిరుపతి లడ్డూ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు.. యావత్ భారతదేశాన్ని వణికిస్తుంది. స్వామి వారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినా నెయ్యిని వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇక ఆ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. ఇంకోపక్క ఈ వివాదాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. స్వామివారికి జరిగిన అన్యాయానికి ఆయన బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఈ వివాదం గురించి తప్పుగా మాట్లాడితే ఫైర్ అవుతున్నారు.


మొన్నటికీ మొన్న కోలీవుడ్ హీరో కార్తీ.. సత్యం సుందరం ప్రీ రిలీజ్  ఈవెంట్ లో లడ్డూ గురించి అపహాస్యంగా  సెన్సిటివ్ విషయమని అన్నాడని.. పవన్ ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి కూడా ఇదే చెప్తున్నాను.. ఈ వివాదానికి సపోర్ట్ గా నిలబడితే సరే కానీ, సనాతన ధర్మాన్ని అవహేళన చేయద్దని తెలిపారు. ఇక దీనికి కార్తీ కూడా పవన్ కు క్షమాపణ కూడా కోరాడు.

ఇక ఈ లడ్డూ వివాదంతో కార్తీ వివాదం కూడా ముదిరింద. తప్పు చేయకుండా కార్తీ సారీ ఎందుకు చెప్పాడు.. ? అని అతనిని కోలీవుడ్ తిట్టిపోస్తుంది. కార్తీ, సూర్యపై నెగెటివ్ టాక్ మొదలయ్యింది. ఇంకోపక్క తెలుగువారు.. ఈ అన్నదమ్ములకు అండగా నిలబడ్డారు. తప్పు చేయకపోయినా కూడా పవన్ మాటను గౌరవించి సారీ చెప్పినందుకు అతని వ్యక్తిత్వాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. ఇక కార్తీ ఘటన తరువాత కోలీవుడ్ స్టార్స్ ఎవరు దీని గురించి మాట్లాడడానికి ధైర్యం చేయడం లేదు. చివరకు సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం.. తిరుపతి లడ్డూ వివాదంపై నో కామెంట్స్ అని చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


ప్రస్తుతం రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి వెట్టయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్. 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన రజినీ.. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఇందులో తిరుపతి లడ్డూ వివాదంపై మీ అభిప్రాయమేంటి.. ? అని అడగ్గా.. రజినీ మాట్లాడుతూ.. సారీ.. నో కామెంట్స్  అని లేచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కార్తీ  ఘటన తెలిసాక.. రజనీ ఇలా కామెంట్స్ చేశాడా.. ? లేక అసలు దీని గురించి మాట్లాడాలి అనుకోలేదా.. ? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంలో నెటిజన్స్ రజినీ తీరును తప్పుపడుతున్నారు. అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి.. ఆయన కూడా ఇలాంటి విషయాలపై సైలెంట్ గా ఉంటే ఎలా  అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది.. అనవసరమైన విషయాలను ఎందుకు కదిలించడం అనుకున్నాడేమో అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా రజినీ ఏది మాట్లాడినా సెన్సేషనే కాబట్టి.. ఆయన నో కామెంట్స్ అన్నా కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×