BigTV English

IIFA 2024 : ఒకే ఫ్రేంలో చిరు, బాలయ్య, వెంకీ… ఐఫా అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

IIFA 2024 : ఒకే ఫ్రేంలో చిరు, బాలయ్య, వెంకీ… ఐఫా అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

IIFA 2024 : సెప్టెంబరు 27న వైభవంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2024 మొదటి రోజు పలువురు దిగ్గజ స్టార్స్ మెరవడంతో అట్టహాసంగా జరిగింది. మరి ఈ వేడుకలో మొదటి రోజు జరిగిన విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


చిరంజీవికి గౌరవం.. ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు లెజెండ్స్
అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లోని ఎతిహాద్ అరేనాలో జరిగిన IIFA ఉత్సవం 2024లో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు లెజెండ్స్ కన్పించి, అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు. 24వ IIFA ఉత్సవం 2024 వేదికపై టాలీవుడ్ సూపర్‌స్టార్స్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ దగ్గుబాటి చాలా ఏళ్ల తరువాత ఒకే వేదికపై కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వేదికపై ఈ ముగ్గురి మధ్య సాగిన సరదా సంభాషణలు IIFA ఉత్సవం 2024లో హైలైట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవిల మధ్య ఉన్న ఆత్మీయత అటు ప్రేక్షకులను, ఇటు చూపరులను ఆకట్టుకుంది. ఇదే వేదికపై మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. IIFA 2024 అవార్డ్స్ ఫెస్టివల్‌లో చిరంజీవికి బెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ ప్రేమికులందరికీ ఇది గర్వకారణం. ఇక మొదటి రోజు ఈ వేడుకలో చిరంజీవ, బాలయ్య, వెంకటేష్ లతో పాటు ఈ వేడుకలో సమంత, ఐశ్వర్య రాయ్, ప్రియమణి, మణిరత్నం, టోవినో థామస్ తదితరులు పాల్గొన్నారు.

ఐఫా 2024 అవార్డ్స్ విన్నర్స్
బెస్ట్ అచీవ్‌మెంట్ ఫర్ ఇండియన్ సినిమా – చిరంజీవి
గోల్డెన్ లెగసీ అవార్డు – నందమూరి బాలకృష్ణ
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియన్ సినిమా – సమంత రూత్ ప్రభు
బెస్ట్ డెబ్యూ కన్నడ – ఆరాధనా రామ్ (కాటెరా)
బెస్ట్ యాక్టర్ తెలుగు – నాని (దసరా)
బెస్ట్ విలన్ తెలుగు – షైన్ టామ్ చాకో (దసరా)
అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్
బెస్ట్ తమిళ మూవీ – జైలర్
బెస్ట్ యాక్టర్ తమిళం – విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్: 2 )
ఉత్తమ నటి తమిళం – ఐశ్వర్య రాయ్ (పొన్నియిన్ సెల్వన్: 2)
ఉత్తమ దర్శకుడు తమిళం – మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్: 2)
ఉత్తమ సంగీత దర్శకత్వం తమిళం : ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్: 2)
బెస్ట్ విలన్ తమిళం : ఎస్జె స్సూర్య (మార్క్ ఆంటోని)
బెస్ట్ విలన్ మలయాళం: అర్జున్ రాధాకృష్ణన్ (కన్నూర్ స్క్వాడ్)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ – మేల్ తమిళం – జయరామ్ (పొన్నియిన్ సెల్వన్: 2)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ – ఫిమేల్ తమిళం – సహస్ర శ్రీ (చిత్త)
కన్నడ సినిమాలో అవుట్ స్టాండింగ్ ఎక్సలెన్స్ – రిషబ్ శెట్టి


ఐఫా సెకండ్ డే సెలబ్రేషన్స్.. బాలీవుడ్ స్టార్స్ సందడి 

రెండవ రోజు IIFA అవార్డ్స్ నైట్‌లో షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్‌.షాహిద్ కపూర్, కృతి సనన్, అనన్య పాండే, జాన్వీ కపూర్ లతో సహా చాలామంది తారలు ప్రేక్షకులను అలరించనున్నారు. హిందీ సీనియర్ నటి రేఖ కూడా చాలా గ్యాప్ తర్వాత IIFAలో పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×