మూవీ పేరు : Vettaiyan (వేట్టయాన్)
విడుదల తేది : 09 అక్టోబర్ 2024
నటీనటులు : రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రానా, ఫహిద్ ఫాజిల్,
దర్శకుడు : T. J. జ్ఞానవేల్
నిర్మాత : సుభాస్కరన్ అల్లిరాజా
సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ : S. R. కతీర్
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
BigtvLive.com Rating – 2/5
Vettaiyan Movie Review in Telugu : తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు వేట్టయాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రజినీకాంత్ మూవీ అంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించవచ్చు. అంతే రేంజ్ లో ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రజనీకాంత్, టీజే జ్ఞానవేల్ కాంబోలో వచ్చిన ‘వేట్టయాన్’ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెల్లవారు జామున 4 గంటల నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో? మూవీ రివ్యూ.. రేటింగ్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
కథ..
రజినీకాంత్ ఈ సినిమా సూపర్ కాప్ పాత్రలో నటించారు. మొదటి నుంచి ఆ పాత్రకు సంబందించిన పోస్టర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని, న్యాయం కోసం నిలబడే సూపర్ కాప్ రజనీకాంత్ అయితే, అమితాబ్ బచ్చన్ సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల ఛాంపియన్ చట్టాన్ని కాపాడుతూ ఉంటాడు. వెట్టయన్ కథ ఏంటంటే.. రజనీకాంత్ తన పై ఉన్న కేసును చేదించేలా ఉంటుంది. రానా పేరు మోసిన కార్ఫోరేటర్ పాత్రలో నటించాడు. రానా పోషించిన పేరుమోసిన కార్పొరేట్ దిగ్గజంతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది అనే దాని చుట్టూ తిరుగుతుంది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లు సమంజసమా? అవి సరైనవా లేక తప్పా? అసలు ముందుకు వెళ్లే మార్గం ఎలా ఉండాలి? వెట్టయన్ తమ వృత్తులకు న్యాయం చేసేలా ఈ సినిమాలో పాత్రలు ఉంటాయని సినిమాను చూస్తే తెలుస్తుంది.
విశ్లేషణ..
జై భీమ్ వంటి బ్లాక్ బాస్టర్ మూవీని అందించిన డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన మూవీ వేట్టయాన్.. అమితాబ్ బచ్చన్ సామాజిక సమస్య గురించి హింట్ ఇవ్వడంతో సినిమా మొదలవుతుంది.. అయితే ఇది త్వరగా హీరో బిల్డప్ ఇంట్రోతో రొటీన్, క్లిచ్ బాటలో పడుతుంది. ఆ తర్వాత పాట ఉంటుంది. పాట యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. దర్శకుడ క్యారక్టర్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు. కొంచెం కథ బోరింగా అనిపించినా సినిమాలో మెసేజ్ ను అందించాడు.. ఒక్క హై పాయింట్ లేదా ఎమోషనల్ బ్లాక్ లేనప్పటికీ, మొదటి సగం చూడదగినదిగా ఉంటుంది.. ఫస్ట్ ఆఫ్ పర్వాలేదని పబ్లిక్ చెబుతున్నారు. ఇంటర్వెల్‌లోని ట్విస్ట్ సెకండాఫ్‌లో మరింత మెరుగైన ట్విస్ట్ ను ఇచ్చింది. కానీ స్టోరీ మొత్తం ఒకే లైన్ తో సాగిందని తెలుస్తుంది. మొత్తం స్టోరీ ఇన్వెస్టిగేషన్ పై నడుస్తుంది. డైరెక్టర్ చూపించాలని అనుకున్న పాయింట్ అయితే సరిగ్గా లేదనే టాక్ ను అందుకుంది. డైలాగులు బాగున్నా కూడా కాస్త ఎక్కువగా మెసేజ్ లు ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అయ్యారని తెలుస్తుంది.
ఇక నటీనటులు విషయానికొస్తే.. రవిశంకర్ ఇక్కడ తనకు ఇచ్చిన చిన్న పాత్రలో బాగానే ఉన్నాడు. రావు రమేష్ ఎప్పటిలాగే తన పాత్రలో జీవించేసాడు.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేశారు. ఇక అనిరుద్ సంగీతం బాగానే ఉన్నా కూడా అది కేవలం పాటల వరకే ఉంటుంది. కానీ బీజిఏం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అతని మార్క్ ఈ మూవీలో కనిపించలేదు. ఇక టెక్నీషియన్స్ కూడా ఎడిటింగ్ వర్క్ ను అక్కడక్కడా సరిగ్గా చెయ్యలేదు. మొత్తానికి సినిమా అసంతృప్తిగానే మిగిలింది. ఓవరాల్ గా డైరెక్టర్ ఈ సినిమా ప్రెజెంట్ చెయ్యడంలో విఫలం అయ్యాడు.. సినిమాను ఒకసారి చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్..
సాంగ్ బాగా వచ్చాయి.
మ్యూజిక్ పర్వాలేదు
ఫస్ట్ ఆఫ్ బాగుంది..
మైనస్ పాయింట్స్..
సెకండ్ ఆఫ్ బోరింగ్..
ఎడిటింగ్ వర్క్
ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమాకు వెళ్ళేవారికి కాస్త కొత్తగా అనిపిస్తుంది.
Vettaiyan Movie Rating : 2/5