BigTV English

Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: ఈరోజే రకుల్ ప్రీత్‌సింగ్ – జాకీ భగ్నానీ పెళ్లి.. హాజరైన బాలీవుడ్ సెలబ్రెటీస్

Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: ఈరోజే రకుల్ ప్రీత్‌సింగ్ – జాకీ భగ్నానీ పెళ్లి.. హాజరైన బాలీవుడ్ సెలబ్రెటీస్
celebrity news today

Rakul Preet Singh and Jackky Bhagnani Wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ హోదా సంపాదించుకున్న నటీమణులలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


రామ్ చరణ్, ఎన్టీఆర్, గోపీచంద్ ఇలా తదితర బడా హీరోలతో జతకట్టి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి.

దీంతో ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి మకాం మార్చింది. అయితే అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకొని సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇక అదే సమయంలో బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం మొదలెట్టింది.


Read More: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ పెళ్లి.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

ఇక అక్కడ నుంచి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతూ వచ్చింది. అయితే చాలా కాలం నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ వార్తలు నిజమయినట్లు తెలుస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు సమాచారం. ఈ రోజు ఈ లవ్ కపుల్ గోవాలో వివాహం చేసుకోబోతున్నారట. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంట వివాహ వేడుకకు బాలీవుడ్ నుంచి ప్రముఖ సెలబ్రెటీలు గోవాకు బయల్దేరారు.

ఇందులో భాగంగా గోవా విమానాశ్రయంలో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానా, ఆయన భార్య తాహిరా కశ్యప్, అర్జున్ కపూర్, లవ్ రంజన్, డేవిడ్ ధావన్‌తో పాటు మరికొందరు ఈ వివాహ వేడుకకు వెళ్తూ కనిపించారు. అలాగే వరుణ్ ధావన్, అతని భార్య నటాషా దలాల్ కూడా సోమవారం గోవా చేరుకున్నారు.

Read More: శూర్పనకగా రకుల్ ప్రీత్‌సింగ్.. రకుల్ ఇమేజ్ ఇంతలా పడిపోయిందా?

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల వివాహ వేడుకలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తమ డ్యాన్స్‌లతో వేడుకను మరింత సందడి చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక రకుల్ ప్రీత్ సినిమాల విషయానికొస్తే.. రకుల్ కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రంలో బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మొదటి భాగం 1996లో విడుదలైంది. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకునే వృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కమల్ హాసన్ నటించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×