BigTV English

Fali S Nariman Passed Away: ప్రముఖ న్యాయనిపుణుడు ఫాలి ఎస్ నారీమన్ కన్నుమూత..

Fali S Nariman Passed Away: ప్రముఖ న్యాయనిపుణుడు ఫాలి ఎస్ నారీమన్ కన్నుమూత..
national news today india

Eminent Jurist Fali S Nariman Passed Away: ప్రముఖ రాజ్యాంగ న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారీమన్(95) బుధవారం న్యూఢిల్లీలో కన్నుమూశారు.


నవంబర్ 1950లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్న నారీమన్.. 1961లో సీనియర్ న్యాయవాది అయ్యారు. అతను 70 సంవత్సరాలకు పైగా న్యాయవాది వృత్తిలో ఉన్నారు. మొదటగా బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1972 నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగారు. మే 1972 లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.

అనుభవజ్ఞుడైన ఫాలి ఎస్ నారీమన్‌కు జనవరి 1991లో పద్మభూషణ్.. 2007లో పద్మవిభూషణ్ లభించాయి.


నారీమన్ 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, ICC (ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) పారిస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను 1995 నుంచి 1997 వరకు జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×