BigTV English

Rakhul Preet as Surpanakha: శూర్పనకగా రకుల్ ప్రీత్‌సింగ్.. రకుల్ ఇమేజ్ ఇంతలా పడిపోయిందా?

Rakhul Preet as Surpanakha: శూర్పనకగా రకుల్ ప్రీత్‌సింగ్.. రకుల్ ఇమేజ్ ఇంతలా పడిపోయిందా?
Rakul Preet Singh new movie update

Rakul Preet Singh as Surpanakha in Nitesh Tiwari Ramayan Movie: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ హీరోయిన్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అందాల భామ. రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆ మధ్య వరుస పెట్టి సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.


అయితే ఈ బ్యూటీకి చాలా కాలం నుంచి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి మకాం మార్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసి.. మంచి హిట్లను అందుకుంది. ఇక సినిమాలతో పాటు ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్‌లపై కూడా ఈ ముద్దుగుమ్మ ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి రెండు మూడు సిరీస్‌లు కూడా చేసి ఓటీటీ ఆడియన్స్‌ను అలరించింది.

ఇక ఇటీవలే కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ‘అయలాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి పోరులో చాలా సినిమాలు ఉండటంతో కేవలం తమిళ్‌లో రిలీజైంది. ఎన్నో అంచనాల నడుమ తమిళ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.


READ MORE: Rakul Preet Singh: నా సక్సెస్ సీక్రెట్ ఇదే: రకుల్ ప్రీత్ సింగ్

ఈ మూవీ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఏ సినిమాలో నటిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఒక పెద్ద సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేంటేంట..

బాలీవుడ్‌లో రామాయణం ఆధారంగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నటీ నటుల విషయంపై అనేక వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపించింది. అలాగే ఇందులో సీతగా రణబీర్ కపూర్ భార్య అలియా భట్‌ను ముందుగా తీసుకోవాలని అనుకున్నారు.

కానీ ఆమె మిగతా సినిమాల షెడ్యూల్లతో బిజీగా ఉండటంతో ఈ మూవీకి ఒప్పుకోకపోయినట్లు సమాచారం. దీంతో సాయి పల్లవిని ఈ మూవీలో సీతగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

READ MORE: Rakul Preet Singh : అతను ‘గే’ అని తెలిస్తే..నేను చేసే మొదటి పని అదే: రకుల్ ప్రీత్ సింగ్

ఇందులో భాగంగానే సాయి పల్లవికి స్క్రీన్ టెస్ట్ కూడా చేసారని సమాచారం. అయితే ఇప్పుడు సాయి పల్లవి కాదని.. ఆమె ప్లేస్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ రామాయణం సినిమాలో మరో పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రావణాసురుడు చెల్లెలు శూర్పనక పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా అనేది చూడాలి.

ఇకపోతే ఈ మూవీలో విభీషణుడిగా విజయ్ సేతుపతి, హనుమంతుడిగా సన్నీడియోల్, కైకేయిగా లారాదత్తను తీసుకుబోతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ విషయాలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×