E-Paper
Advertisement

Rakul Preet Singh : జీవితంలో ఎక్కువ కాలం ఒంటరిగానే ఉన్నా.. ఎందుకంటే..?

Rakul Preet Singh : తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందించారు. నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై రకుల్‌ స్పందించారు.

Rakul Preet Singh : జీవితంలో ఎక్కువ కాలం ఒంటరిగానే ఉన్నా.. ఎందుకంటే..?
Advertisement

Rakul Preet Singh : తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందించారు. సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై రకుల్‌ స్పందించారు.

ప్రతి ఒక్కరూ భాగస్వామిని కలిగి ఉండడం సహజమైన ప్రక్రియన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్న వారిపై పెళ్లి విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయన్నారు. తను ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా జీవించాను. జాకీ తన జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయిందన్నారు.

Advertisement

జాకీ ఇదే పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో తనను పూర్తిగా అర్థం చేసుకున్నాడని రకుల్ పేర్కొన్నారు. తామిద్దరం సినిమా, ఫిట్‌నెస్‌ను ఎక్కువగా ఇష్టపడతామన్నారు. రోజుకు 12 గంటలు షూటింగ్‌లో బిజీగా ఉంటామన్నారు. కేవలం గంట మాత్రమే కలిసి సమయాన్ని గడుపుతామని, ఆ సమయంలో కూడా వ్యక్తగత విషయాలు మాత్రమే మాట్లాడుకుంటామని రకుల్ తెలిపారు.

రకుల్ ప్రీతిసింగ్ తన సినీ కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానన్నారు. సినీ నేపథ్యం లేకపోవడం వల్ల మొదట్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియలేదన్నారు. తన తొలి సినిమాతోనే ఆదరణ లభించడం వల్ల అదృష్టం కలిసి వచ్చిందన్నారు. సినీ కెరీర్‌ తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎక్కువగా కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లోనే నటించానన్నారు. మంచి స్క్రిప్ట్‌ ఉన్నప్పుడు ఎక్కువ గంటలు కూడా గడిపానన్నారు. ఎప్పుడు పారితోషికం గురించి ఆలోచించలేదని రకుల్ తెలిపారు.

Advertisement

రకుల్ మొదటగా ‘గిల్లి’ కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన తెలుగు చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘అయలాన్‌’తో పలకరించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×