E-Paper
Advertisement

రూ.84,790 కోట్లతో భాగ్యనగరం రూపురేఖలు చేంజ్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిగ్ ప్లాన్!

రూ.84,790 కోట్లతో భాగ్యనగరం రూపురేఖలు చేంజ్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిగ్ ప్లాన్!
Advertisement

Bhatti Vikramarka: హైదరాబాద్‌ను కేవలం దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే ఒక అగ్రగామి నగరంగా నిలబెట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం రూ.84,790 కోట్లతో భారీ కార్యాచరణను రూపొందించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.55 వేల కోట్ల పనులకు డిజైన్లు, టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం విశేషం.

మౌలిక వసతులు, మంచినీటి సరఫరాకే ప్రాధాన్యం

Advertisement

నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండీఏ, మెట్రో అభివృద్ధి, గ్రోత్ కారిడార్లకు రూ.52,706 కోట్లు కేటాయించారు. అలాగే తాగునీరు, సీవరేజ్ నెట్‌వర్క్ పనులకు రూ.15,849 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.4,000 కోట్లు, మల్కాజిగిరికి రూ.2,500 కోట్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.2,163 కోట్లు వెచ్చించనున్నారు.

30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ

Advertisement

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా నాలుగో అభివృద్ధి కేంద్రంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ రూపుదిద్దుకోనుంది. 30 వేల ఎకరాల్లో విస్తరించే ఈ నగరంలో 15 వేల ఎకరాలను కేవలం పచ్చదనం, బహిరంగ ప్రదేశాలకే కేటాయిస్తున్నారు. ఇక్కడ యువత కోసం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

మూసీ పునరుజ్జీవనం, కాలుష్య రహిత నగరం

మూసీ నది ప్రక్షాళనకు తొలిదశలో రూ.7,500 కోట్లు కేటాయించారు. మురుగునీరు కలవకుండా 21 చోట్ల ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ-బస్సులు, ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహిస్తూ, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను దశలవారీగా బయటకు తరలించేందుకు ‘హిల్ట్ పాలసీ’ తీసుకొచ్చారు.

సంక్షేమానికి పెద్దపీట

ఒకవైపు మౌలిక వసతులు కల్పిస్తూనే, మరోవైపు సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థిక సాయం, 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ సేవలు, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేస్తూ తెలంగాణను నూతన శకంలోకి తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.

Also Read: మణిపూర్ పోకుండా ఇక్కడికెందుకొచ్చావ్? అమిత్ షాపై మంత్రి పొన్నం ఫైర్!

Tags

Related News

మణిపూర్ పోకుండా ఇక్కడికెందుకొచ్చావ్? అమిత్ షాపై మంత్రి పొన్నం ఫైర్!

మియాపూర్ భూముల వ్యవహారం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, లక్షా 50 వేల కోట్ల భూములు కాపాడాం

సెల్‌ఫోన్ ఆ యువతికి శాపమైంది.. కూతుర్ని చంపిన తల్లి, రంగారెడ్డి జిల్లాలో ఘోరం

అతివేగం కొంప ముంచింది.. పల్టీలు కొట్టిన టయోటా ఇన్నోవా, రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే?

మూసీ సుందరీకరణ కాదు.. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం!

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు!

Big Stories

Advertisement
×