E-Paper
Advertisement

బజాజ్ ఆటో బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి మరో రెండు కొత్త బైక్ బ్రాండ్లు!

బజాజ్ ఆటో బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి మరో రెండు కొత్త బైక్ బ్రాండ్లు!
Advertisement

Bajaj Two New Bike Brands: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో తన మోటార్‌ సైకిల్ పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో  125cc నుంచి 250cc విభాగం వరకు రెండు కొత్త బైక్ ప్రొడక్ట్ లైన్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ విషయాన్ని బజాజ్ ఆటో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శర్మ వెల్లడించారు. ఈ రెండు కొత్త బ్రాండ్లు పల్సర్ శ్రేణికి అదనంగా అందుబాటులోకి రానున్నాయి. భారత్ తో పాటు విదేశీ మార్కెట్లలో కూడా వీటిని అమ్మేలా ప్లాన్ చేస్తున్నారు. భిన్న అవసరాలు, అభిరుచులు కలిగిన కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నారు.

రెండు కొత్త బ్రాండ్లతో విస్తరించనున్న బజాజ్

బజాజ్ తీసుకురానున్న రెండు కొత్త ప్రొడక్ట్ లైన్లు 125cc నుంచి 250cc మధ్య సబ్ సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే, ఈ రెండు బ్రాండ్లు ఒకే రకమైన బైక్‌లను అందించవు. ఒక్కో బ్రాండ్ ఒక్కో తరహా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించనున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం 100cc బైక్‌లు ఉపయోగిస్తున్న కస్టమర్లు మరింత శక్తివంతమైన మోటార్‌ సైకిళ్లకు మారేలా ప్రోత్సహించాలని బజాజ్ భావిస్తోంది. ఈ కొత్త బ్రాండ్లు పల్సర్‌ కు భిన్నమైన గుర్తింపుతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

పల్సర్, డొమినార్ మోడళ్లకు కొత్త అప్‌డేట్స్

Advertisement

కొత్త బ్రాండ్లతో పాటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పల్సర్, డొమినార్ బైక్‌లపైనా బజాజ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. 160cc నుంచి 400cc వరకు ఉన్న మోడళ్లలో మరిన్ని మార్పులు, అప్‌డేట్స్ తీసుకురావాలని యోచిస్తోంది. గత కొంతకాలంగా 125cc, 150cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌ల విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా తగ్గింది. కొన్ని మోడళ్లు పాతబడటం కూడా దీనికి ఒక కారణమని రాకేష్ శర్మ తెలిపారు. దీంతో పాత పల్సర్ మోడళ్లను కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులతో అప్‌డేట్ చేస్తున్నారు.

కొత్త మోడళ్లకు పెరుగుతున్న ఆదరణ

ఇటీవల బజాజ్ కొత్త పల్సర్ 125, పల్సర్ 150తో పాటు N160, NS400Z, N250, NS200 మోడళ్లను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని కంపెనీ వెల్లడించింది. బజాజ్ 125cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌ల పోర్ట్‌ ఫోలియోలో కొత్త మోడళ్ల వాటా ఆగస్టులో 7 శాతంగా ఉండగా, సెప్టెంబర్‌లో 26 శాతానికి పెరిగింది. పండుగ సీజన్‌లో మొదటి 16 రోజుల్లో ఇది 33 శాతానికి చేరినట్లు రాకేష్ శర్మ తెలిపారు.

విదేశీ మార్కెట్లలోనూ బజాజ్ దూకుడు

Advertisement

దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల్లోనూ బజాజ్ మంచి వృద్ధిని సాధిస్తోంది. FY2027 రెండో క్వార్టర్ లో కంపెనీ విదేశాలకు పంపిన వాహనాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 41 శాతం పెరిగింది. మొత్తం 7.8 లక్షల వాహనాలకు చేరుకుంది. ఆఫ్రికా మార్కెట్లో ఎగుమతులు 83 శాతం, బ్రెజిల్‌తో పాటు లాటిన్ అమెరికా ప్రాంతంలో 44 శాతం వృద్ధి నమోదైంది. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, ఇప్పటికే ఉన్న దేశాల్లో మరిన్ని బైక్ మోడళ్లను పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తులో ఎగుమతులను మరింత పెంచుకోవాలని బజాజ్ ఆటో లక్ష్యంగా పెట్టుకుంది. రెండు కొత్త బైక్ బ్రాండ్లు, పల్సర్ మోడళ్ల అప్‌డేట్స్‌ తో 125cc నుంచి 250cc విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని బజాజ్ ఆటో ప్రయత్నిస్తోంది.

Read Also: ఏథర్ కోనార్క్ లాంచ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

Tags

Related News

బజాజ్ చేతక్‌ కు భారీ డిమాండ్.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ బిగ్ ప్లాన్!

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్‌.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUV!

భారత్ లోకి డెంజా Z9 GT.. లాంచ్‌ కు ముందే టీజర్ రిలీజ్!

ఆరేళ్లలో 3.5 లక్షల అమ్మకాలు.. టాటా ఆల్ట్రోజ్ సరికొత్త రికార్డు..

ట్యూబ్‌ లెస్ స్పోక్ వీల్స్‌ తో రాయల్ ఎన్‌ఫీల్డ్.. కొత్త బైక్ విశేషాలు ఇవే!

ఏథర్ కోనార్క్ లాంచ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×