BigTV English

Rakul Preet Singh: గాయాల పాలైన రకుల్ ప్రీత్ సింగ్.. ఏం జరిగిందంటే..?

Rakul Preet Singh: గాయాల పాలైన రకుల్ ప్రీత్ సింగ్.. ఏం జరిగిందంటే..?

Rakul Preet Singh.. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో ప్రార్ధన ప్రతిరూపాయి కౌంటింగ్ ఇక్కడ అనే డైలాగ్ తో భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఫిట్నెస్ ఫ్రీక్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు జిమ్లో కష్టపడుతూ వర్కౌట్లు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జిమ్లో బరువైన కసరత్తులు చేస్తూ ఆకట్టుకునే ఈమె తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


వెయిట్ లిఫ్ట్ కారణంగా వెన్నుపూస పై ప్రభావం..

బీపీ డౌన్ అయిందని, చెమటలు పట్టడంతో ఆమె తీవ్ర అస్వస్థకు గురైంది అంటూ ఒక వార్త ఇప్పుడు అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. అసలు విషయంలోకి వెళితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. వర్కౌట్ సెషన్ లో 80 కేజీల డెడ్ లిఫ్ట్ ను ఎత్తడంతో వీపుకు కాస్త గాయమైందని సమాచారం. ముఖ్యంగా వెన్నుపూసపై ఆ బరువు ప్రభావం పాక్షికంగా చూపించిందట. నడుముకి ఎలాంటి సేఫ్టీ బెల్ట్ ధరించకుండా వెయిట్ లిఫ్ట్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారానికి పైగా ఆమె బెడ్ రెస్ట్ లోనే ఉందట. డాక్టర్లు కూడా రెస్ట్ తీసుకోమని సూచించడంతో క్రమంగా రెస్ట్ తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంది.


రకుల్ కెరియర్ లో అది బ్యాడ్ సెలబ్రేషన్..

కానీ నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో రకుల్ దేదే పర్యార్ దే -2 సినిమా షూటింగ్ కి హాజరైంది అని సమాచారం. ఇక చిన్నపాటి నొప్పిని భరిస్తూనే షూటింగ్లో పాల్గొనగా అక్కడ కూడా చిన్నపాటి నొప్పిని భరించినట్లు సమాచారం. ఇకపోతే నొప్పి రోజు రోజుకూ ఎక్కువ అవుతుండడంతో ఫిజియోథెరపీ కూడా మొదలుపెట్టిందట. అయినా నొప్పి తగ్గలేదని ప్రతి నాలుగు గంటలకు ఒకసారి నొప్పి వచ్చేదని రకుల్ తెలిపింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 10 వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్ బర్తడే కావడంతో సెలబ్రేషన్ కు కూడా రెడీ అయింది. కానీ ఈ వెన్నునొప్పి ఆమె కెరియర్ లో ఒక బ్యాండ్ సెలబ్రేషన్ గా మిగిలిపోయింది అని సమాచారం పుట్టినరోజు పార్టీకి ఒక గంట ముందు వీపు గాయం కారణంగా ఎంతో ఇబ్బంది పడిందట. ఇక ఈ గాయం కారణంగానే ఎల్ ఫోర్, ఎల్ ఫైవ్, ఎస్ వన్ నరాలు కూడా జామ్ అయినట్లు తెలుస్తోంది. బీపీ డౌన్ అవ్వడం వల్లే ఒళ్లంతా చెమటలు పట్టడంతో ఆమెను మంచం మీదే పడుకోబెట్టి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం . ఇక ఆ తర్వాత వైద్యులను పిలిపించి కండరాల సడలింపుకు అవసరమైన ఇంజక్షన్లు ఇవ్వడంతో మళ్లీ యధాస్థితికి చేరుకుందని సమాచారం. ఆరోగ్యం నిలకడగా ఉండే వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిన్నపాటి వ్యాయామాలు అయినా చేయనిదే రోజు గడవని రకుల్ కి ఇప్పుడు అదే వ్యాయామాలు ప్రాణహానిగా మారడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Rakul Singh (@rakulpreet)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×