BigTV English

Nick Jonas : ప్రియాంక చోప్రా భర్తకు ప్రాణహాని? లైవ్ లో స్టేజ్ పై నిక్ పారిపోవడానికి అదే కారణమా?

Nick Jonas : ప్రియాంక చోప్రా భర్తకు ప్రాణహాని? లైవ్ లో స్టేజ్ పై నిక్ పారిపోవడానికి అదే కారణమా?

Nick Jonas : ప్రస్తుతం ఇండియాలో సల్మాన్ ఖాన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఆందోళన కలిగించే విషయం బయటకు వచ్చింది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్తకు ప్రాణహాని అంటూ తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.


లైవ్ లో స్టేజ్ వదిలి పారిపోయిన నిక్
ఇప్పుడు హాలీవుడ్‌లో నివసిస్తున్న ప్రముఖ బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ అన్న విషయం తెలిసిందే. నిక్ జోనాస్ తో పాటు అతని సోదరులు నిర్వహించే జోనాస్ బ్రదర్స్ ఈవెంట్ లకు లక్షలాది మంది అభిమానులు పోటెత్తుతారు. ఇటీవల జరిగిన అటువంటి ఒక ఈవెంట్ లో నిక్ జోనాస్ వేదికపై పర్ఫార్మెన్స్ ఇస్తుండగానే వేదికపై నుండి పారిపోయాడు. దీంతో నిక్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే అకస్మాత్తుగా స్టేజ్ వదిలి పారిపోవడానికి ఒక కారణం ఉంది.

అసలేమయిందంటే ?
నిక్ సోదరులు పెరూలో లైవ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. నిక్ జోనాస్, జో జోనాస్, కెవిన్ జోనాస్ కూడా వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. స్టేజ్ చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీని నిర్మించారు. ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలి వచ్చారు. అయితే సడన్ గా వేదికపై ఉన్న నిక్.. తన వెనుక గ్యాలరీలో నిలబడి ఉన్న వ్యక్తులను చూసి, వేదిక దిగి తన సెక్యూరిటీకి చేయి ఊపుతూ వేదికపై నుంచి పరుగెత్తాడు. దీంతో జనాలు ఆశ్చర్యపోయారు.


నిక్ పారిపోవడానికి కారణం ఏంటంటే?
ఈవెంట్ లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న నిక్‌ పై ఎవరో తెలియని వ్యక్తి లేజర్ లైట్‌ ను వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రెడ్ లైట్ రైఫిల్ గన్లలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు రెడ్ లైట్ ప్రమాద సూచికగా కూడా వాడతారు. అదే కారణంతో నిక్ జోనాస్ రెడ్ లేజర్ అతనిపై పడినప్పుడు పారిపోయి దాక్కున్నాడు. అతని సెక్యూరిటీ గార్డులు వెంటనే తనిఖీ చేసి లేజర్‌ లైట్ ను వేసిన వ్యక్తిని కనుగొని అతన్ని అరెస్టు చేశారు.

కాగా నిక్ జోనాస్ ప్రసిద్ధ హాలీవుడ్ రాపర్, పాప్ సింగర్. జోనాస్ బ్రదర్స్ అనే అతని బ్యాండ్ ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్. నిక్ ఒకప్పుడు భారతదేశంలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా 2018 లో వివాహం చేసుకున్నారు. నిక్‌ని పెళ్లాడిన తర్వాత ప్రియాంక హాలీవుడ్‌లో స్థిరపడింది. ఇద్దరికీ మాల్టీ అనే కూతురు ఉంది. నిక్ జోనాస్ గాయకుడే కాదు పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. కాగా ఈ విషయంపై ఇటు నిక్ జోనాస్ గానీ, అటు ప్రియాంక చోప్రా గానీ ఇంకా స్పందించలేదు. దీంతో ఆ వైరల్ అవుతున్న వీడియోను చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×