Rakul Preet Singh: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth singh) ఒకరు. కెరటం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ వంటి హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్నారు.
ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటో నిరూపించుకున్న రకుల్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ కూడా నటిగా తనని తాను నిరూపించుకున్నారు. ఇలా ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక బాలీవుడ్ సినిమాలలో కొనసాగుతూ నటుడు, నిర్మాత జాకీభగ్నాని(Jocky Bhagnani) ప్రేమలో పడి పెద్దల సమక్షంలో తనని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహ గత రెండు సంవత్సరాల క్రితం గోవాలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాలలో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో సరైన కథ లభించకపోవడం వల్లే సౌత్ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని, సౌత్ సినిమాలలో నటించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని రకుల్ చెబుతూ వచ్చారు..
ఆ బాధ వారికే తెలుస్తుంది…
ఇక రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే… పెళ్లి చేసుకున్న తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ప్రెగ్నెన్సీ (Pregnancy)గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ప్రస్తుతం రకుల్ ప్రెగ్నెన్సీ తో ఉందని అయితే ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తల పై రకుల్ ఎక్కడ స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అబార్షన్స్(Abortions) గురించి రకుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చాలామంది మహిళలు చేసే తప్పు అబార్షన్స్ అని తెలిపారు.
ప్రతి ఒక్క భర్త అర్థం చేసుకోవాలి…
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండానే అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలామంది సులభంగా అబార్షన్ చేయించుకో అని చెబుతారు కానీ ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. పిల్లలు ఇప్పుడే వద్దనుకునే వారికి ఎన్నో మార్గాలు ఉన్నాయి వాటిని అనుసరించాలి తప్ప ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అబార్షన్ చేయించుకోవడం అనేది చాలా తప్పని తెలిపారు. అబార్షన్ చేయించుకోవడం అనేది ఎంత కష్టమో ఎవరు అర్థం చేసుకోలేరు, ఒక జీవాన్ని శరీరం నుంచి బయటకు పంపించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క భర్త అర్థం చేసుకోవాలని, తమ భార్యలకు మద్దతుగా నిలబడాలే తప్ప అబార్షన్ చేయించుకో అంటూ ఒత్తిడి తీసుకురావద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.