BigTV English

Urvashi Rautela: “నేనే ఓ బ్లూ ప్రింట్”.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఊర్వశి రౌటేలా!

Urvashi Rautela: “నేనే ఓ బ్లూ ప్రింట్”.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఊర్వశి రౌటేలా!

Urvashi Rautela:బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ఏ చిన్న విషయమైనా సరే దానిపై రియాక్ట్ అవుతూ అప్పుడప్పుడు ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అభిమానులకు గట్టి కౌంటర్ ఇచ్చింది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో..” నేను ఎవరికి కాపీ కాదు..నేనే ఓ బ్లూ ప్రింట్ ని” అంటూ ఐశ్వర్య రాయ్ అభిమానులని హర్ట్ చేసింది. మరి ఇంతకీ ఊర్వశి రౌటేలా పెట్టిన ఆ పోస్టులో ఉందేంటి.. ఇంతకీ ఐశ్వర్య రాయ్ అభిమానులను ఎందుకు హార్ట్ చేసింది.. ? ఊర్వశి రౌటేలాని ఐశ్వర్యరాయ్ తో ఎందుకు పోల్చారు? అనేది ఇప్పుడు చూద్దాం..


ఐశ్వర్యరాయ్ ని కాపీ కొట్టిన ఊర్వశి..

తాజాగా ఫ్రాన్స్ లో కేన్స్ 78వ ఫిలిం ఫెస్టివల్ ను గ్రాండ్ గా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంతోమంది సౌత్, నార్త్ హీరోయిన్లు రెడ్ కార్పెట్ పై స్టైలిష్ డ్రెస్సులు వేసుకొని ఫోటోలకు, వీడియోలకు ఫోజులిచ్చారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లకు సంబంధించి.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దిగిన ఫోటోలు,వాళ్ళు వేసుకున్న డ్రెస్ లకు సంబంధించిన ప్రత్యేకతలు ఇలా ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగా కేన్స్ 78వ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా వేసుకున్న ఓ డ్రెస్ ని చూసి చాలామంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో ఆమె వేసుకున్న డ్రెస్ ని పోస్ట్ చేస్తూ.. ఇది 2018లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఐశ్వర్యరాయ్ వేసుకున్న డ్రెస్ ని రీ క్రియేట్ చేసింది అని.. ఐశ్వర్య రాయ్ లుక్ ని ఊర్వశి రౌటేలా కాపీ కొట్టింది అటు కొంతమంది ఐశ్వర్య రాయ్ అభిమానులు న్యూస్ వైరల్ చేశారు.అయితే ఈ వార్తలు ఊర్వశి రౌటేలా వరకు వెళ్లడంతో తాజాగా తన సోషల్ మీడియా ద్వారా రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.


రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన ఊర్వశి..

ఊర్వశి రౌటేలా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది.. “నేను ఎవరికి కాపీని కాదు.. నేనే ఒక బ్లూ ప్రింట్ ని.. ఐశ్వర్య రాయ్ ఐకానిక్..ఆమెని కాపీ కొట్టడానికి నేను ఇక్కడికి రాలేదు.. కేన్స్ నన్ను ఆహ్వానించినప్పుడు అక్కడ ప్రత్యేకంగా కనిపించడానికి వచ్చాను.. బహుశా మీకు నా లుక్ అసౌకర్యంగా అనిపిస్తుంది కావచ్చు.. అయినా నా లుక్ చూసి ఓర్వలేని కొంతమంది ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు “అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఊర్వశి రౌటేలా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఊర్వశి రౌటేలా పెట్టిన ఈ పోస్టు ఐశ్వర్యరాయ్ ఫ్యాన్స్ కి కౌంటర్ ఇచ్చినట్టు ఉంది. మరి ఊర్వశి పెట్టిన ఈ పోస్ట్ కి ఐశ్వర్య అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

ALSO READ:Comedian Sathya: ఓటీటీని శాసించడానికి సిద్ధమైన సత్య.. బెట్టింగ్ భోగి పాత్రలో..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×