Ram Charan: రామ్ చరణ్ నటించే ప్రతి సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆయన గత చిత్రాల అనుభవాలను చూస్తే, టీజర్ లేదా గ్లింప్స్ విడుదలలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ మొదలైన కొద్ది రోజుల్లోనే గ్లింప్స్ విడుదల చేయగా, మరికొన్ని చిత్రాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది.
RRR – 494 రోజులు వెయిట్!
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR సినిమాలో రామ్ చరణ్ “అల్లూరి సీతారామరాజు” పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి గ్లింప్స్ షూటింగ్ ప్రారంభమైన 494 రోజుల తర్వాత వచ్చింది. ఈ టైమ్‌ఫ్రేమ్ కొంచెం ఎక్కువగానే అనిపించినా, రాజమౌళి సినిమాలకు అభిమానులు ఎప్పుడూ ఓపికగా వెయిట్ చేస్తారు. అయితే, సినిమా ప్రమోషన్ల విషయంలో కూడా రాజమౌళి చాలా స్ట్రాటజిక్‌గా ఉండడం వల్ల, ఇది పెద్ద సమస్యగా మారలేదు.
Game Changer – 1,114 రోజులకు గ్లింప్స్!
షంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Game Changer సినిమాకు మాత్రం అభిమానులు అతి పెద్ద వెయిట్ పీరియడ్ ఎదుర్కొన్నారు. Game Changer షూటింగ్ మొదలై 1,114 రోజులు అయ్యాకే గ్లింప్స్ విడుదలైంది. ఈ ఆలస్యం వెనుక పలు కారణాలు ఉన్నాయి –
ఇది అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, భారీ లెవల్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు మాత్రం తగ్గలేదు.
Peddi – 135 రోజుల్లోనే గ్లింప్స్!
ఇటీవల రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ పెద్ది షూటింగ్ మొదలైంది. అయితే, ఈసారి గ్లింప్స్ వచ్చేందుకు కేవలం 135 రోజులు పట్టింది. ఇది చరణ్ కెరీర్‌లోనే చాలా త్వరగా విడుదలైన ఫస్ట్ లుక్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ బుచ్చిబాబు సన… చరణ్ ని కొత్తగా ప్రెజెంట్ చేయడమే కాకుండా ఫాస్ట్ గా అప్డేట్స్ కూడా ఇస్తూ పెద్ది సినిమాపై బజ్ పెరిగేలా చేస్తున్నాడు.
ఈ గ్లింప్స్‌లో చరణ్ మాస్ లుక్, రగ్డ్ అవతార్ చూపించడం విశేషం. గత సినిమాలతో పోల్చితే, ఇది చాలా తక్కువ టైమ్‌లో విడుదలవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. దీనివల్ల సినిమా మీద హైప్ వెంటనే క్రియేట్ అయ్యింది. సో ఇప్పటి ట్రెండ్ ప్రకారం పెద్ది సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అయినట్లే.. ముఖ్యంగా, మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమాతో చాలా డిజప్పాయింట్ అయ్యారు, ఇలాంటి టైమ్ లో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వాలంటే ఆ మాత్రం ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావాల్సిందే. ఇప్పటివరకూ పోస్టర్స్ తోనే కిక్ ఇచ్చిన పెద్ది మేకర్స్… శ్రీరామ నవమి పండగ రోజున గ్లింప్స్ తో పాన్ ఇండియా వైడ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.