Sleeping: కొంతమంది నిద్రకు బానిసలు. అంటే నిద్ర చాలా ఇష్టం కాబట్టి మిగతావన్నీ మర్చిపోతారు. పడుకున్నారంటే ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు. కానీ వాస్తవానికి.. క్రమం తప్పకుండా ఆలస్యంగా నిద్రపోవడం తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది . ఇది మాత్రమే కాదు.. ఇది మీకు ప్రాణాంతకం కూడా కావచ్చు.
ఎక్కువగా నిద్ర పోయే వారు రాత్రి తొందరగా పడుకున్నా కూడా ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు.అంటే 8-9 గంటల కంటే ఎక్కువగా నిద్ర పోతారు. అసలు రోజుకు ఎంత నిద్రపోవాలి ? తాజా నివేదిక నిద్ర వేళలకు సంబంధించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర: క్రమం తప్పకుండా ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులకు అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. ఆలస్యంగా నిద్రపోక,వడం వల్ల మీరు అనేక ఇతర ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని పరిశోధకులు చెబుతున్నారు. ఏడు గంటలు క్రమం తప్పకుండా మంచి, గాఢంగా నిద్రపోయే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. వారు శారీర మానసిక సమస్యలతో బాధపడే అవకాశం తక్కువ.
ఈ ప్రమాదాన్ని గుర్తించండి:
రోజుకు ఏడు గంటలకు పైగా నిద్రపోయే వారిలో అభిజ్ఞా క్షీణత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అంతే కాకుండా వారికి మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే.. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులు కూడా అనేక ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇవి ఎప్పుడూ అలసిపోయినట్లు ఉంటారు. మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి. వీరికి కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇందుకు సంబంధించిన పరిశోధన సమయంలో.. పరిశోధకులు తక్కువ నిద్రపోయే చాలా మంది మెదడులను స్కాన్ చేశారు. తక్కువ నిద్రపోయేవారిలో భావోద్వేగాలకు సంబంధించిన మెదడు భాగం కుంచించుకుపోయినట్లు కనిపిస్తుందని గుర్తించాలరు. అంతే కాకుండా వారు మానసికంగా బలహీనంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. దీని కారణంగా.. వారి మానసిక స్థితి అన్ని వేళలా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఐదు లక్షల మందిపై పరిశోధన:
ఇంగ్లాండ్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయం చేసిన ఈ పరిశోధనలో, 38 నుండి 73 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సుమారు ఐదు లక్షల మంది నిద్ర డేటాను అధ్యయనం చేశారు. క్రమం తప్పకుండా ఎక్కువగా నిద్రపోయే వ్యక్తులు ‘అంతర్లీన వ్యాధుల’తో బాధపడే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. దీని అర్థం వారికి దీర్ఘకాలిక గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుడ.. యాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం కూడా ఇటువంటి వారిలో చాలా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
Also Read: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఒక్కటి వాడితే..చందమామ లాంటి ముఖం
తొమ్మిది గంటలకు పైగా నిద్రపోయే వారిలో అల్జీమర్స్ అనే మెదడు వ్యాధి సంకేతాలు ఎక్కువగా ఉంటాయని గతంలో జరిగిన పరిశోధనలో తేలింది. అయితే.. వార్విక్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఏడు గంటలకు పైగా నిద్రపోవడం కూడా ప్రాణాంతక పరిస్థితి అని అంటున్నారు. దీని కంటే తక్కువ నిద్రపోవడం కూడా మీ ఆరోగ్యంతో ఆడుకున్నట్లే అవుతుందట. నిద్ర , ఆరోగ్యం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన పరిశోధన అని చెప్పవచ్చు.