E-Paper
Advertisement

Ram Charan : RC 15…చరణ్ లుక్స్.. శంకర్ స్కెచ్ తెలిస్తే షాకే

Ram Charan : RC 15…చరణ్ లుక్స్.. శంకర్ స్కెచ్ తెలిస్తే షాకే
Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మీడియా వర్గాల సమాచారం మేరకు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌ను మించి దిల్ రాజు, శిరీష్ RC 15ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ శంకర్ మేకింగ్ గురించి తెలిసిందే కదా.. దీంతో చరణ్ సినిమా మరి కాస్త వెనక్కి వెళ్లింది. హ్యూజ్ స్కేల్‌లో సినిమాను నిర్మించటంలో శంకర్‌ని మించిన వాళ్లు లేరు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో RC 15 తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఏఖంగా 27 లుక్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌ని అలరించబోతున్నారట.

మెగా పవర్ స్టార్‌ని 27 లుక్స్‌లో ఇటు ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు మెప్పించేలా చూపించటం కోసం హాలీవుడ్ మేకప్ మ్యాన్స్‌ని తీసుకొచ్చారట శంకర్. RC 15లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఓ పాత్రలో చెర్రీ ముఖ్యమంత్రిగా కనిపిస్తే.. మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా కావటంతో సినిమా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. నెక్ట్స్ షెడ్యూల్ న్యూజిలాండ్‌లో మొదలు కానుంది. ఆ షెడ్యూల్‌లో పాటను చిత్రీకరించబోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×