Big Stories

Puri Jagannadh : జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. వాళ్లనే మోసం చేశాను.. పూరి ఎమోషనల్ లెటర్

పూరి జగన్నాథ్ మాస్ ఇమేజ్‌ని సరికొత్త కోణంలో ప్రెజంట్ చేసే డైరెక్టర్. అందుకనే నేటి తరం టాప్ స్టార్స్ అంతా ఆయనతో కలిసి పనిచేయాలని తహ తహలాడారు. ఆయన కూడా వారితో సినిమాలు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో పూరి తెరకెక్కించిన లైగర్ రిలీజ్ తర్వాత .. ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లైగర్ పరాజయంతో ఆయన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయితే మరో సినిమాతో మళ్లీ లేస్తానని అస్సలు భయపడేది లేదని అంటున్నారు పూరి జగన్నాథ్. జీవితంలో మనకు ఎదురయ్యే సక్సెస్, ఫెయిల్యూర్ గురించి దర్శకుడిగా కాకుండా.. రైటర్‌గా, జీవితాన్ని తరచి చూసిన వ్యక్తిగా పూరి రాసిన ఎమోషనల్ లెటర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ లెటర్‌లో పూరి ఏం చెప్పారో చూద్దాం..

- Advertisement -

‘‘సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఈ రెండు ఆపోజిట్ అనుకుంటాం. కాదు.. ఈ రెండు ఫ్లో లో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెలా నిండా ఊపిరి పీలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చేయాల్సిన పని ఏంటి? ఊపిరి వదిలేయ్యటమే. పడతాం, లేస్తాం, ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చాక నెక్ట్స్ జరిగేది ఏంటి? పగలబడి నవ్వటమే. ఇక్కడ ఏదీ పర్మనెంట్ కాదు. లైఫ్‌లో మనకు జరిగే ప్రతి సంఘటననిమనం ఒక ఎక్స్‌పీరియెన్స్‌లా చూడాలే తప్ప ఫెయిల్యూర్ సక్సెస్‌లా చూడకూడదు. నడిచా, మెట్టు ఎక్కా, పడిపోయా, కాలు జారింది, నదిలో పడిపోయా, కొట్టుకుపోాయా, ఒడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు. ఊరు వెలేసింది. ఊరేసుకోవాలనిపించింది. ఎవడో కాపాడాడు. వాడు నేను కౌగిలించుకున్నాం. వాడే మోసం చేశాడు. ఇలా లైఫ్‌లో ఎన్నో జరగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్‌ని సినిమాలా చూస్తే షో అయిపోగానే మరచిపోవచ్చు. మైండ్‌కి తీసుకుంటే మెంటల్ వస్తుంది. సక్సెస్ డబ్బులొస్తాయి.

- Advertisement -

ఫెయిల్ అయితే బోలెడు జ్ఞానం వస్తుంది. సో మనం ఎప్పుడూ మెంటల్లీ, ఫైనాన్సియల్సలీ గెయిన్ అవుతూనే ఉంటాం తప్పఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదీ ఉండదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్‌గా చూడొద్దు. చెడు జరిగితే మన చుట్టూ ఉన్న చెడ్డవారంతా మాయమైపోతారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా. కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి. అది రిస్క్ అవ్వాలి. జీవితంలో రిస్క్ చెయ్యకపోతే అది లైఫే కాదు. రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్. లైఫ్‌లో నువ్వు హీరో అయితే సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అన్నీ జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్లీ విడుదల చేస్తారు, అందరూ Claps కొడతారు. అక్షింతలు వేస్తారు. ఇవన్నీ లైఫ్‌లో జరగకపోతే జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదనుకునే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయితీ పరుడునని చెప్పుకోనవసరం లేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. ట్రూత్ ఆల్ వేస్ డిఫెండ్స్ ఇట్ సెల్ఫ్.

ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ మనలన్ని పీకేవాళ్లు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైతే మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియెన్స్‌ని తప్ప ఎవరినీ మోసం చేయలేదు. ఐయామ్ లయబుల్ టు మై ఆడియెన్స్. మళ్లీ ఇంకో సినిమా తీస్తా. వాళ్లని ఎంటర్‌టైన్ చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడ నుంచి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి. నేనూ దాచుకుంటా. పైనల్‌గా అందరూ కలిసేది శ్మశానంలోనే. మధ్య జరిగేది అంతా హై డ్రామా’’ అని జీవితం గురించి అందులో మనం ఫేస్ చేసే సక్సెస్, ఫెయిల్యూర్ గురించి రైటర్‌గా చక్కటి పాఠాలను చెప్పారు పూరి జగన్నాథ్.

జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి.. కానీ మనం మాత్రం ముందుకు పోవాలంటూ చెప్పిన పూరి ఎమోషనల్ లెటర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News