Ram Charan:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తాజాగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’.. జనవరి 10వ తేదీన చాలా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేపట్టింది. అందులో భాగంగానే రామ్ చరణ్, బాలయ్య (Balakrishna ) హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె’ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా తన మనసులోని కోరిక బయటపెట్టి అసలు విషయాన్ని చెప్పడంతో ఇరువురి హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు.. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్ తో రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ..
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR ), రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా వచ్చిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. 2021 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. ఆ స్నేహం ఈ సినిమాకి మరింత ఉపయోగపడింది. ఇక్కడ ఎవరి పాత్ర ఎక్కువ? ఎవరి పాత్ర తక్కువ ? అనే చర్చ కూడా ప్రధానంగా నడిచినా.. ఇద్దరు హీరోలు కీ రోల్ పోషించారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక నటనలో కూడా ఎవరికి వాళ్లు బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించారు..
మహేష్ బాబుతో మూవీ పై మనసులో కోరిక బయటపెట్టిన చెర్రీ..
ఇదిలా ఉండగా మరొకవైపు అల్లు అర్జున్ (Allu Arjun) తో రామ్ చరణ్ మల్టీస్టారర్ కి సంబంధించిన సన్నహాలు జరుగుతున్నాయని, డైరక్టర్ అట్లీ (Atlee)ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో మల్టీ స్టారర్ వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే రామ్ చరణ్, మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో సినిమా. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా రామ్ చరణ్ వెల్లడించారు. మంగళవారం జరిగిన అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ ఎనిమిదవ ఎపిసోడ్ షూటింగ్లో భాగంగా బాలయ్య తో మాట్లాడుతూ.. చరణ్ ఇలాంటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారట. తను కోరుకుంటున్న మల్టీస్టారర్ మూవీ ఇదేనని, మహేష్ బాబు తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలనేదే తన కోరిక అని రాంచరణ్ తెలిపినట్లు సమాచారం.
వర్కౌట్ అయ్యేనా..
ఇకపోతే సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు మంచి స్నేహితులే. ఈ ముగ్గురు ఏ అకేషన్ వచ్చినా సరే కలుసుకుంటారు. ఈ క్రమంలోనే వీరి మధ్య మంచిర్యాపో కూడా ఉంది. స్నేహం, చనువు కూడా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి కోరికను బయటపెట్టారు రామ్ చరణ్. మరి ఇది వర్కౌట్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే, ఈ విషయం మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) తో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు.ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.