BigTV English

Ram Gopal Varma: వర్మ కొత్త ఏడాది రిజల్యూషన్స్.. అన్నీ వర్కౌట్ అయ్యేనా..?

Ram Gopal Varma: వర్మ కొత్త ఏడాది రిజల్యూషన్స్.. అన్నీ వర్కౌట్ అయ్యేనా..?

Ram Gopal Varma:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారారు. ముఖ్యంగా ఏ విషయం అయినా మొహమాటం లేకుండా మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన కొత్త సంవత్సరానికి గానూ తన రిజల్యూషన్స్ అన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు వర్మ యేనా ఇలాంటి పోస్ట్ పెట్టింద. అంటూ సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం


కొత్త తీర్మానాలతో వర్మా పోస్ట్..

సాధారణంగా కొత్త ఏడాది మొదలైంది అంటే సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం తమలో ఉన్న ఏదో ఒక విషయంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అందులో భాగంగానే సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను, నిర్ణయాలను పంచుకుంటారు . ఇప్పుడు రాంగోపాల్ వర్మ కూడా కొత్త ఏడాది తనలో మార్పు తీసుకువచ్చే అంశాలు ఇవే అంటూ ఒక జాబితాని షేర్ చేశారు. మరి వర్మ షేర్ చేసిన ఆ జాబితాలో ఏమేమున్నాయో ఇప్పుడు చూద్దాం. తాజాగా రాంగోపాల్ వర్మ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా.. నేను చేసిన 7 కొత్త సంవత్సర తీర్మానాల సెట్ ఇక్కడ ఉన్నాయి.


1. నేను వివాద రహితుడిగా మారతాను.

2. కుటుంబ వ్యక్తిగా మారుతాను.

3. నేను దేవుడికి భయపడేవాడిని అవుతాను.

4. ప్రతి సంవత్సరం 10 సత్య తరహా సినిమాలు చేస్తాను.

5.ఇకపై నేను ట్వీట్ చేయడం మానేస్తాను.

6. నేను స్త్రీల వైపు చూడను.

7.నేను వోడ్కా తీసుకోవడం మానేస్తాను

అలాగే నాతో నేను తప్ప అందరితో ప్రమాణం చేస్తున్నాను.. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ వర్మ తన తీర్మానాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన చాలామంది ఇవన్నీ కలిపితేనే వర్మ. అలాంటిది ఇవన్నీ ఇకపై చెయ్యను అని ఇలా సడన్ ట్విస్ట్ ఇచ్చాడేంటి? అంటూ ఆయనను అభిమానించే ఫ్యాన్స్ కూడా కామెంట్ లు చేస్తున్నారు. మరి వర్మ నిజంగానే పాటిస్తాడా? లేక కావాలని పోస్ట్ పెట్టి అందరిని ఫూల్స్ చేస్తాడా? అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

రాంగోపాల్ వర్మ కెరియర్..

రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే.. ఒకప్పుడు శివ, క్షణం క్షణం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. వర్మ రంగంలోకి దిగాడు అంటే కచ్చితంగా ఏదో మెసేజ్ ఇచ్చే సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాడని అందరూ కూడా అనుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన తన రూట్ మార్చుకోవడం జరిగింది. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పటికైనా తనలో మార్పు రావాలని కోరుకునే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. మరి వారి కోరిక మేరకు రామ్ గోపాల్ వర్మ ఎలా తనను తాను మార్చుకొని సక్సెస్ అవుతారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×