Ram Charan’s Game Changer Release Date Locked: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి గేమ్ ఛేంజర్‌పై ఫుల్ హైప్ ఉంది.
అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ‘జరగండి.. జరగండి’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ చాలా రియాలిటీగా.. అద్భుతంగా కలర్ ఫుల్‌గా ఉంటూ అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ కోసం చాలామంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అంటూ వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‌పై మూవీ నిర్మాత దిల్ రాజు అదిరిపోయే అప్డేట్ అందించాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని.. ఇంకో నాలుగైదు నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపాడు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్ బయటకొచ్చింది.
Also Read: పుష్ప ఇంటిని చుట్టు ముట్టేసిన ఫ్యాన్స్.. ఇదేం క్రేజ్ రా బాబు.. వీడియో వైరల్
ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దివాళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి సామాన్య రాజకీయ నేతగా.. మరొకటి ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న మూవీ.. అదీ గాక స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్ కాబట్టి మూవీ గట్టిగానే ఉంటుందని ప్రేక్షకాభిమానులు చర్చించుకుంటున్నారు.