Sai Durga Tej – Ram Charan : మెగా హీరోస్ లో సాయి దుర్గ తేజ్ ఒకరు. అయితే సాయి దుర్గ్ కెరియర్ లో హిట్ సినిమాలు కంటే కూడా డిజాస్టర్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. సాయి తేజ్ కి తన కెరియర్ లో డిజాస్టర్ సినిమాలు ఉన్నా కూడా తన కొత్త సినిమా రిలీజ్ అయితే మంచి ఆదరణ లభిస్తుంది. దీనికి సాయి తేజ్ వ్యక్తిత్వం కారణమని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం సాయితేజ్ కి, కొన్ని విషయాల్లో సాయి తేజ్ స్పందించిన విధానం కూడా చాలామందిని ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. మొత్తానికి ఎప్పటినుంచో తాను చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ తో సినిమా కూడా కలిసి చేసేసాడు.
ఇకపోతే సాయి తేజ్ కెరియర్ లో కూడా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. సాయి తేజ్ కెరియర్ లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ ప్రస్తావన వస్తే చాలామంది రిపబ్లిక్ అనే సినిమా అని చెబుతారు. అయితే ఆ సినిమా రిలీజ్ తరుణంలో సాయి తేజ్ ఒక యాక్సిడెంట్ కి గురి అయ్యాడు. ఆ తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టింది. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. అయితే సాయి తేజ్ రిపబ్లిక్ తర్వాత చేసిన సినిమా విరూపాక్ష. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సాయి తేజ్ కు కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.
ప్రస్తుతం సాయి తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పుడు రోహిత్ కేపి అనేే డైరెక్టర్ తో ఓ మూవీ చేస్తున్నాడు. దానికి సంబరాల ఏటి గట్టు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనిలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని ఈ చిత్రం నమోదు చేసుకుంటుంది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ ఈవెంట్ కు రామ్ చరణ్ తేజ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇకపోతే రామ్ చరణ్ గురించి ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. బయట పబ్లిక్ లో చాలా హుందాగా కనిపిస్తారు కానీ బాగా పర్సనల్ గా కనెక్ట్ అయిన వ్యక్తులతో చాలా కామెడీగా ఉంటారు చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ టైం లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒకరినొకరు గిల్లుకోవడం చాలా ఇంటర్వ్యూస్ లో చూసాం. ఇప్పుడు మళ్లీ అదే సాయి తేజ్ తో రిపీట్ చేశాడు చరణ్.
సాయి తేజ్ ను చరణ్ ను కలిపి ఒకేసారి స్టేజి మీదకి ఇన్వైట్ చేశారు. ఈ తరుణంలో సాయితేజ్ పక్కన చరణ్ నిల్చున్నాడు ముందుకు ఫోటోకు ఫోజులిస్తున్న కూడా వెనకనుంచి సాయి తేజ్ ను గిల్లడం మొదలు పెట్టాడు. అయితే కొన్ని వీడియోస్ లో ఇది కూడా కనిపిస్తుంది. ఈ విషయాన్ని బయటకు చెప్పలేక సరిగ్గా ఫోటోకి ఫోజు ఇవ్వలేక సాయి తేజ్ నవ్వుతూనే ఉన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యే అవకాశం ఉంది. సాయి తేజ్ కాసేపు నవ్విన తర్వాత చరణ్ తేజ్ భుజం మీద చేయి వేసి మీడియాకు ఫోటోలు ఇచ్చారు.
Also Read : Yadamma Raju: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ భార్య..