Sambarala Yeti Gattu: విరూపాక్ష సినిమాతో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ మంచి రీఎంట్రీ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. బైక్ యాక్సిడెంట్ తరువాత వచ్చిన ఈ సినిమా తేజ్ కెరీర్ కు పెద్ద బూస్ట్ నే ఇచ్చింది. ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టకుండా చాలా పకడ్బందీగా కథలను ఎంచుకొని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విరూపాక్ష తరువాత సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాను ప్రకటించాడు తేజ్. కానీ, ఈ సినిమా పట్టాలెక్కకుండానే పక్కకు వెళ్ళిపోయింది. బడ్జెట్ సమస్యవలన ఆగిపోయిందని వార్తలు వినిపించాయి.
Yadamma Raju: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ భార్య..
ఇక ఆ సినిమా తరువాత తేజ్ నటిస్తున్న చిత్రం SDT18. రోహిత్ కెపి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో డైరెక్టర్ తో తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమానుప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటిస్తుండగా.. జగపతి బాబు, శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ళ కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఎప్పటి నుంచో ఈ చిత్రానికి సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ.. తాజాగా అదే టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంబరాల ఏటిగట్టు టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు.
” నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు సామీ, నీ అహానిది. తను ఉంచినన్నాళ్లు మీ అడుగు నేలమీద కాకుండా నెత్తిన పెట్టుకుంటాం” అని సాయి కుమార్ బేస్ వాయిస్ తో చెప్పగా .. నీ నెత్తురు కోసం ఎగబడే కత్తులతో ఒకడు కాసుకున్నాడప్పా అని జగపతి బాబు డైలాగ్ తో తేజ్ ఇంట్రడక్షన్ చూపించారు. ఇక వచ్చినవారిని వచ్చినట్లు తన కత్తికి బలి ఇస్తూ.. కోపంతో రగిలిపోతున్న తేజ్ లుక్ అదిరిపోయింది. యాక్సిడెంట్ తరువాత కొద్దిగా బరువు తగ్గిన తేజ్.. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ను ట్రై చేసినట్లు కనిపిస్తుంది.
Bachhala Malli Song: మరీ అంత కోపం.. ఎంత మంచిగుంది సాహిత్యం
ఇక ఆ రక్తపు మడుగులో అందరిని చంపేసి.. “ఏటిగట్టు సాక్షిగా చెప్తున్నా.. ఈ తూరు నేను నరికినాను అంటే అరుపు గొంతులోచి కాదు.. తెగిన నరాల్లో నుంచి వస్తాది ” అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ తో టైటిల్ ను రివీల్ చేశారు. ఇక తేజ్ కు పైన ఒక పెద్ద మనిషి కాలును చూపించారు. అది ఎవరిది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
తేజ్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. గుబురు మీసాలు.. పొడవాటి జుట్టు, చొక్కా లేకుండా తేజ్ కనిపించిన విధానం సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.