Yadamma Raju: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొండసరు ఇప్పుడు స్టార్స్ గా కూడా ఎదిగారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, హైపర్ ఆది.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ నే ఉంది. ప్రస్తుతం వీరందరూ ఒకపక్క షోస్ చేస్తూనే.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇలా కమెడియన్స్ గా మారినవారిలో యాదమ్మ రాజు ఒకడు.
పటాస్ షోలో ఒక స్టూడెంట్ గా వచ్చిన యాదమ్మరాజు.. తన అమాయకమైనముఖంతో కామెడీ చేస్తుంటే ప్రేక్షకులు పగలబడి నవ్వేవారు. అలా పటాస్ నుంచి కామెడీ షోస్ లతో గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు.. సద్దాం టీమ్ లో ఒకడిగా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో సద్దాం టీమ్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా యాదమ్మ రాజు కమెడియన్ గా మంచి పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు.
Bachhala Malli Song: మరీ అంత కోపం.. ఎంత మంచిగుంది సాహిత్యం
ఇక యాదమ్మరాజు స్టెల్లా అనే యువతిని పెళ్లాడిన విషయం తెల్సిందే. ఓకే టీవీ షోలో యాంకర్ ప్రదీప్ వీరి ప్రేమను అధికారికంగా తెలపడం.. స్టేజి మీదకు వచ్చిన ఆమె సర్ ప్రైజ్ గా యాదమ్మరాజు పేరును టాటూ వేయించుకొని కనిపించడంతో.. వీరి జంట యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఇరు కుటుంబ వర్గాలను ఒప్పించి ఈ జంట ఒకత్తయ్యారు. ఆ తరువాత నుంచి స్టెల్లా కూడా ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారింది.
భర్త యాదమ్మరాజుతో కలిసి షోస్ చేస్తూ అభిమానులను అలరించింది. షోస్ తోనే కాకుండా ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. అందులో తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ ఏడాదిలోనే యాదమ్మరాజు – స్టెల్లా వారి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కానున్నట్లు తెలిపారు.
Raviteja: రవితేజ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. సితార ఎంటర్ టైన్మెంట్స్ లో.. ?
ఒక టీవీ షోలో స్టెల్లా సీమంతం అంటూ ఈవెంట్ కూడా చేశారు. ఇక తాజాగా నేడు స్టెల్లా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుపుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. సడెన్ గా డెలివరీ అయ్యిందని తెలిపింది. ” నాకు ఇంకా నొప్పులు రాలేదు. డెలివరీ డేట్ ఎప్పుడో ఇచ్చారు. ఇక నార్మల్ చెకప్ కోసం వెళ్తే ఉమ్మనీరు తక్కువ ఉందన్నారు. త్వరగా ప్రసవం చేయాలని చెప్పడంతో ఒక ఇంజెక్షన్ తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేసు.. వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాలన్నారు.
Pawan Kalyan Prabhas: ఒకే ఫ్రేమ్‌లో పవన్ కళ్యాణ్, ప్రభాస్.. ఈ కాంబోతో కలెక్షన్ల ఊచకోత కన్ఫర్మ్
నాకు అప్పటికే భయం మొదలయ్యింది. బిడ్డకు గ్యారెంటీ ఇవ్వలేమని అన్నారు. యాదమ్మరాజును పట్టుకొని చాలా ఏడ్చాను. ఆ తరువాత రోజు మాకు తెలిసినవాళ్లతో కలిసి గాంధీ హాస్పిటల్ కు వెళ్లి ఉమ్మనీరు ఎక్కించాము. ఇలా ఒక దాని తరువాత ఒక హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం. ఈ భయం వలనే నేను సీమంతం కూడా చేసుకోలేకపోయాను. నా డెలివరీ డేట్ కంటే 15 రోజుల ముందే నేను డెలివరీ అయ్యాను. మగబిడ్డ పుట్టాడు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగానే ఉన్నాడు. నేను చాలా బాధపడ్డాను. దేవుడి దయవలన అంతా మంచే జరిగింది” ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.