BigTV English
Advertisement

Ram Charan Sanjay Leela Bhansali : బాలీవుడ్ దిగ్గజ దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ.. కథ ఇదే..!

Ram Charan Sanjay Leela Bhansali : బాలీవుడ్ దిగ్గజ దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ.. కథ ఇదే..!

Ram Charan Sanjay Leela Bhansali movie(Today tollywood news): ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీ తర్వాత తాను నటించబోయే సినిమాలన్నీ మరో రేంజ్‌లో ఉండాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తన వద్దకు వచ్చిన కథలలో డిఫరెంట్ స్టోరీలను ఎంచుకున్నాడు. ఇలా ఇప్పడు తన లైనప్‌లలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘గేమ్ ఛేంజర్’.


దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

ఈ మూవీతో బాక్సాఫీసు రికార్డులను తిరగరాయడానికి చరణ్ చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అయినా.. సమ్మర్‌కు ఈ మూవీని రిలీజ్ చేసి సెన్సేషన్ సృష్టించాలని అనుకుంటున్నాడట. ఇక ఈ మూవీ తర్వాత తన లైనప్‌లో మరో సినిమా చేయబోతున్నాడు. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సనాతో ‘ఆర్‌సి 16’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీలో నటినటుల కోసం చిత్రబృందం వేట మొదలెట్టింది.


ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికోసం ఆడియషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీ తర్వాత చరణ్ ఇంకొందరి దర్శకులను లైన్‌లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందులో సుకుమార్, లోకేష్ కనగరాజ్ వంటి డైరెక్టర్లతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

READ MORE: Ram Charan – Janvi Kapoor: రామ్ చరణ్‌‌తో చిందులేయనున్న ఎన్టీఆర్ భామ..? సౌత్ సినిమాలతో బిజీ అయిన జాన్వీ కపూర్

ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త మెగా అభిమానులలో ఫుల్ జోష్ నింపింది. రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సుహల్ దేవ్’ టైటిల్‌తో ఓ మూవీ రూపొందనున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ వార్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ ఉండనున్నట్లు సమాచారం. ‘ది లెజెండ్ ఆఫ్ సహల్ దేవ్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు ఈ మూవీ స్టోరీ ఏంటని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఏంటనేది బయటకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతానికి చెందిన సుహల్ దేవ్ అనే వీరుడు 11వ శతాబ్దంలో శ్రావస్తి రాజ్యాన్ని పరిపాలించాడు. రాజపుత్ర వంశానికి చెందిన సుహెల్ దేవ్ 1034లో CEలో గజ్నవిద్ దళాలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి.

READ MORE: RAM CHARAN: రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సిరీస్ మూవీ కోసం మంతనాలు..!

ఆ సమయంలో అతడు బర్హాజ్ యుద్దం అని పిలువబడే బహ్రైచ్ యుద్దంలో ఘూజీ సయ్యద్ సలార్ మసూద్ నేతృత్వంలో ఘజ్నవిద్ దళాలపై విజయం సాధించాడు. అయితే సుహల్ దేవ్ సైన్యం చిన్నదైనా.. దృఢమైన సంకల్పంతో చాలా పెద్ద గజ్నవిద్ సైన్యాన్ని ఎదుర్కొంటాడు. ఇలా భారతదేశం చూసిన అతి గొప్ప రోజుల్లో సుహల్ దేవ్ ఒకరు.

ఇలాంటి కథతో సంజయ్ లీలా భన్సాలీ పాన్ ఇండియా రేంజ్‌లో రామ్ చరణ్‌తో సినిమా తీయబోతున్నాడు అంటేనే ఓ రేంజ్‌లో గూస్‌బంప్స్ వస్తున్నాయి. ప్రస్తుం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో చరణ్‌ను వీరుడిగా చూడాలని మెగా అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×