E-Paper
Advertisement

Bail for Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ కు ఊరట.. 12 కేసుల్లో బెయిల్

Bail for Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ కు ఊరట.. 12 కేసుల్లో బెయిల్
Advertisement
Today news paper telugu

Court grants bail to Imran Khan(Today news paper telugu): సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్న తరుణంలో పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ఖాన్‌కు కాస్త ఊరట లభించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్న తరుణంలో పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ఖాన్‌కు కాస్త ఊరట లభించింది. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు 12 కేసుల్లో బెయిల్‌ మంజూరైంది. ఆయనతో పాటు విదేశాంగ శాఖ మాజీమంత్రి షా మహమ్మద్‌ ఖురేషీకి కూడా ఊరట లభించింది.

గత సంవత్సరం మేలో మిలటరీ కార్యాలయంపై దాడులకు సంబంధించిన అంశంపై ఇమ్రాన్ ఖాన్ పైన కేసు నమోదయ్యింది.ఈ కేసులలో నిందితులు అందరూ బెయిల్‌పై ఉన్నందున ఖాన్‌ను జైల్లో ఉంచడం సమర్థనీయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఇమ్రాన్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఆయనకు ఇప్పటికే పలు కేసుల్లో శిక్షలు ఉండడం. ఇదిలాఉంటే.. ఆయన బలపరిచిన అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read More: పాకిస్థాన్ లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. దేశాన్ని ఏలేదెవరు ?

Advertisement

గత ఏడాది మేలో అవినీతి కేసులో ఇమ్రాన్‌ అరెస్టు అయ్యారు. ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. మే 9న వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఇమ్రాన్‌ మద్దతుదారులు దాడులకు దిగి భవనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. రావల్పిండిలోని ఆర్మీబేస్‌ క్యాంప్‌పైనా దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనలపై ఇమ్రాన్‌ సహా 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Related News

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×