BigTV English

Manchu Manoj:- మంచు మ‌నోజ్‌కి రామ్ చ‌ర‌ణ్ – ఉపాస‌న స‌ర్‌ప్రైజ్‌

Manchu Manoj:- మంచు మ‌నోజ్‌కి రామ్ చ‌ర‌ణ్ – ఉపాస‌న స‌ర్‌ప్రైజ్‌

Manchu Manoj:- మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మ‌ధ్య మ‌ళ్లీ బాండింగ్ పెరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత రెండు కుటుంబాల మ‌ధ్య దూరం పెరిగిందనేది ఎవ‌రూ కాద‌న‌లేద‌ని వాస్త‌వం. అయితే ఇప్పుడు ఆ రెండు ఫ్యామిలీలు మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వుతున్నాయి. ఇలా చెప్ప‌టానికి కార‌ణం.. రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ల‌క్ష్మీ మంచు, మంచు మ‌నోజ్ ప్ర‌త్యేకంగా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో మోహ‌న్ బాబుసైతం త‌న‌కు, చిరంజీవికి గిల్లి క‌జ్జాలు స‌హ‌జంగా ఉన్న‌ప్ప‌టికీ తాము క‌లిసిపోతుంటామ‌ని అన్నారు.


ఇప్పుడు మ‌రోసారి మంచు, మెగా ఫ్యామిలీలు కలిసి పోయాయ‌ని చెప్ప‌టానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ దొరికింది. అదేంటంటే మంచు మ‌నోజ్‌కి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని మనోజ్ రివీల్ చేశారు. అదేంటంటే.. ఇటీవ‌ల మంచు మ‌నోజ్‌, భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నూత‌న దంప‌తుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ రూ.75 వేల బ‌హుమ‌తిని పంపి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఆ గిఫ్ట్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ మంచు మ‌నోజ్ ట్వీట్ చేశారు. మనోజ్, మౌనికల పెళ్లికి రామ్ చరణ్ దంపతులు హాజరు కాలేదు.

‘మాపై మీరు చూపించిన ప్రేమకు స్వీట్ కపుల్‌కు ధ‌న్య‌వాదాలు. ఇలాంటి స‌ర్‌పైజింగ్ గిఫ్ట్స్ ఎంతో విలువైన‌వి. ల‌వ్ యూ మిత్ర‌మా! మీరు మాల్దీవుల ట్రిప్ ముగించుకుని రాగానే మిమ్మ‌ల్ని క‌లిసేందుకు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నాను. మీ ట్రిప్ మీకు అద్భుతంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అని మ‌నోజ్ తెలియ‌జేస్తూ ఫొటోలను కూడా షేర్ చేశారు. రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్‌పై మనోజ్ ఇలా ఓపెన్‌గా రియాక్ట్ కావటం వారి అభిమానులను, నెటిజన్స్‌ని ఎంతో సంతోష పెడుతుంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×