BigTV English

Salaar Digital Rights:- షాకింగ్ రేటుకి ‘సలార్’ డిజిటల్ రైట్స్

Salaar Digital Rights:- షాకింగ్ రేటుకి ‘సలార్’ డిజిటల్ రైట్స్

Salaar Digital Rights:- పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌ను ప్రేక్ష‌కుల కోసం సిద్ధం చేస్తున్నారు. అందులో ఆది పురుష్ మూవీ మాత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. మిగిలిన మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా, స‌లార్, ప్రాజెక్ట్ K. ఈ మూడు ప్రాజెక్ట్స్ దేనిక‌వే ప్ర‌త్యేక‌మైన‌వి. అందులో స‌లార్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి స్పెష‌ల్‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. KGFతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌టంతో స‌లార్ సినిమాపై రోజురోజుకీ క్యూరియాసిటీ పెరిగి పోతుంది.


ఇప్ప‌టి వ‌ర‌కు స‌లార్ మూవీ నుంచి రెండు, మూడు పోస్ట‌ర్స్ మిన‌హా మ‌రేమీ అప్‌డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకుంటున్నాయి. సినిమాను ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 28నే రిలీజ్ చేస్తామ‌ని రీసెంట్‌గా మేక‌ర్స్ మ‌రోసారి క‌న్‌ఫ‌ర్మ్ చేసేశారు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ స‌హా అంద‌రిలో ఎగ్జ‌యిట్మెంట్ పెరిగిపోతుంది. ఇక డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈ సినిమా హ‌క్కుల కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే స‌లార్ డిజిట‌ల్ హ‌క్కుల కోసం మేక‌ర్స్ ఏకంగా రూ.200 కోట్ల‌ను కోట్ చేశార‌ట‌. ఇంత భారీ మొత్తంలో ఉన్న‌ప్ప‌టినీ రైట్స్ కోసం ఓటీటీ సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

ఈ ఏడాది ప్ర‌భాస్ ప‌క్కాగా రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌టం ప‌క్కా అయ్యింది. అందులో ఆదిపురుష్ జూన్ 16న వ‌స్తుంటే.. స‌లార్ సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ అవుతుంది. కె.జి.య‌ఫ్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ప్ర‌శాంత్ నీల్ హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేస్తార‌నే సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, జ‌గ‌ప‌తిబాబు విల‌న్స్‌గా న‌టిస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×