E-Paper
Advertisement

Ram Charan – Upasana Visits Tirumala: శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు..

Ram Charan – Upasana Visits Tirumala: శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు..
Advertisement

ram Charan Upasana

Ram Charan – Upasana Visits Tirumala: గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ – ఆయన సతీమణి ఉపాసన దంపతులు వారి కుమార్తె క్లీంకారతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తిరుమలకు విచ్చేశారు. తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆలయానికి వచ్చిన చెర్రీ – ఉపాసనలకు టిటిడి అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన చరణ్ తో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

Advertisement

1985 మార్చి 27న పుట్టిన రామ్ చరణ్ కు ఇది 39వ పుట్టినరోజు. 2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీకి మెగా వారసుడిగా పరిచయమైన చెర్రీకి.. మగధీర సినిమాతో లైఫ్ టర్న్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. సినీ ప్రియులకు కొత్త అనుభూతినిచ్చింది. పంచదార బొమ్మ బొమ్మ పాటైతే.. ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో.. చెర్రీ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ లో పెరిగింది. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గురించి ప్రపంచానికి తెలిసింది. మెగా పవర్ స్టార్ కాస్తా.. ఆర్ఆర్ఆర్ దెబ్బకు గ్లోబల్ స్టార్ అయ్యాడు.

Also Read: జరగండి.. జరగండి సాంగ్ ఏముంది బాసూ.. వేరే లెవెల్ అంతే..

Advertisement

ఆర్ఆర్ఆర్ తర్వాత.. ఏ సినిమా చేసినా అది అంతకుమించి ఉండాలే తప్ప తగ్గకూడదు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి.. జరగండి.. సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో చరణ్ లుక్ చాలా బాగుంది. గతేడాది దీపావళికే జరగండి..జరగండి సాంగ్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ.. అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది. తాజాగా.. ఈ సాంగ్ ను రిలీజ్ చేయడంతో.. ప్రేక్షకాభిమానుల ఎదురుచూపులకు తెరపడింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×