E-Paper
Advertisement

Gaami OTT Release: ఓటీటీలోకి విశ్వ‌క్‌సేన్ ‘గామి’.. జీ5లో స్ట్రీమింగ్ కానున్న సూపర్ హిట్ సినిమా.. ఏప్రిల్ 5 నుండి..!

Gaami OTT Release: ఓటీటీలోకి విశ్వ‌క్‌సేన్ ‘గామి’.. జీ5లో స్ట్రీమింగ్ కానున్న సూపర్ హిట్ సినిమా.. ఏప్రిల్ 5 నుండి..!
Advertisement
viswak sen
vishwak sen Gaami OTT Release Date

Vishwak Sen’s Gaami Streaming on Zee 5 from April 5th: మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు తెరకెక్కిన సినిమాలు చాలానే చూసాం. అయితే అలాంటిదే రీసెంట్‌గా ఓ సినిమా వచ్చింది. అయితే ఈ మూవీ కాస్త డిఫరెంట్. ఓ సమస్య కారణంగా హీరో ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అయితే ముప్పు నుంచి బయటపడాలంటే ఓ సొల్యూషన్ దొరుకుతుంది. త్రివేణి పర్వతంపై 36 ఏళ్లకు ఒకసారి పూసే మాలిపత్రి అనే ఔషద మొక్క ఆ హీరోకు అవసరం పడుతుంది.

దానికోసం ఆ హీరో హిమాలయాలకు పయణమవుతాడు. ఇప్పటికీ ఏంటా సినిమా అని ఆలోచిస్తున్నారా?. అదేనండీ మొన్ననే వచ్చిన విశ్వక్ సేన్ గామి సినిమా. విధ్యాదర్ కాగిత దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించింది.

Advertisement

ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో నటించి అదరగొట్టేశాడు. తన యాక్టింగ్‌తో అభిమానులను ఫుల్ ఖుష్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాకి విజువల్ ఎఫెక్స్ట్ చాలా ప్లస్ పాయింట్. దాదాపు రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.22 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

Also Read: జరగండి.. జరగండి సాంగ్ ఏముంది బాసూ.. వేరే లెవెల్ అంతే..

Advertisement

ఇక థియేటర్లలో దుమ్ము దులిపేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అలా వెయిట్ చేస్తున్నవారికి ఓ వార్త ఫుల్ ఎనర్జీని అందించింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ మూవీ ఏప్రిల్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ ఏకకాలంలో స్ట్రీమింగ్ కానున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఇకపోతే విశ్వక్ సేన్ తరచూ కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గామి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు అదే జోష్‌లో మరికొన్ని చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ కృష్ణ చైతన్యతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో నటిస్తున్నాడు.

Also Read: రామాయణం పనులు మొదలుపెట్టిన రణ్‌బీర్.. ఫొటోలు చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 17న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో విశ్వక్ సేన్‌కు జోడీగా నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో పాటు విశ్వక్.. రవితేజ ముళ్లపూడి అనే కొత్త దర్శకుడితో ఓ మూవీ చేయబోతున్నాడు. వీటితో పాటు మరో రెండు చిత్రాలు లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×