Big Stories

Supriya Shrinate Ugly Comments on Kangana: నోరు జారుడు రాజకీయం.. నేతలూ జాగ్రత్త .. జనం చూస్తున్నారు..!

politics

- Advertisement -

Congress Leader Supriya Shrinate Ugly Comments on Kangana Ranaut: నేతల తీరు మారదు.. వారి నోటి తీట తీరదు. యస్‌.. పదాలు కాస్త పరుషంగా ఉన్నా.. ఇది ఫ్యాక్ట్.. ఈసీ ముందే వార్న్‌ చేసింది. కాస్త హద్దులు దాటినా.. ఖబర్ధార్ అని.. కాని పట్టించుకున్న వారేరి.. ఎలక్షన్ సమయంలో నేతల నోర్లు పేలుతున్నాయి. విమర్శల రేంజ్‌ దాటి నిందల దాకా వచ్చేశారు.. ముఖ్యంగా మహిళలను చాలా దారుణమైన పదాలతో ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

ఇది స్టేట్‌ లెవల్‌లో జరుగుతున్న విషయం. ఇక నేషనల్ లెవల్‌లో మరో వివాదం నడుస్తోంది. బీజేపీ తమ ఐదవ అభ్యర్థుల జాబితాలో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్‌కు.. సీటు కేటాయించింది. ఈ లిస్ట్ అలా బయటికి వచ్చిందో లేదో.. అప్పుడే మొదలైంది రచ్చ..కంగనా పిక్‌ను షేర్ చేస్తూ మండిలో ఎంత ధర పలుకుతుందో తెలుసా? అంటూ పోస్ట్ పెట్టారు కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేట్. ఇక దీనిపై మొదలైంది రాజకీయ రచ్చ.. సమర్థిస్తూ కొందరు.. విమర్శిస్తూ మరికొందరు.. రెచ్చిపోయారు.

ఇవి మచ్చుకు రెండు మాత్రమే.. ఇలాంటివి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ప్రత్యర్థులను అత్యంత దారుణమైన పదాలతో తిట్టడం.. అందులో ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేయడం..
ఇప్పుడు కామన్‌గా మారింది. మహిళలే మహిళలను టార్గెట్ చేయడం మరింత దారుణమనే చెప్పాలి.

Also Read: వారే మెట్టు దిగారు.. వీరెందుకిలా? ఏపీ బీజేపీ నేతల తీరు మారదా?

ఎలక్షన్‌ కమిషన్ ముందే చెప్పింది. ఎలక్షన్స్ వచ్చాయంటే నేతలకు పూనకాలు వస్తాయి. మైక్‌ పట్టుకుంటే ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో.. తెలీయకుండా బిహేవ్ చేస్తారని..
విమర్శలు, ఆరోపణల స్టేజ్ దాటి.. తిట్లు, బూతుల వరకు వెళ్తారని.. సంస్కారం మరిచి దిగజారుడు రాజకీయాలు చేస్తారని.. అందుకే కాస్త కంట్రోల్‌లో ఉండాలని ముందే చెప్పింది. మాటలతో ప్రజలను, సమాజాన్ని విభజించవద్దని కోరింది. విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్‌ పెట్టండి.. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకండి.. ఇంకా చాలా సూచనలు చేసింది. ఒక్కరైనా వింటున్నారా? ఒక్కరైనా పాటిస్తున్నారా?

ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తున్నారు. కంగనా కావచ్చు.. ప్రశాంతి రెడ్డి కావచ్చు.. గతంలో నారా భువనేశ్వరి కావచ్చు.. వైఎస్‌ భారతీ కావచ్చు.. రాష్ట్రాలు వేరేనా.. ఎక్కువగా బాధితులుగా మారుతున్నది మహిళలే.. మాట్లాడితే నారీశక్తి అని స్పీచ్‌లు ఇచ్చే ఆ నేతలే.. వారు కనీసం తలెత్తుకునేలా కూడా మాట్లాడకపోతే ఎలా? కనీస మర్యాద ఇవ్వకుండా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. సబ్జెక్ట్‌పై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారు?

మాములుగా మహిళలు ఇళ్లు దాటి వచ్చి ఉద్యోగాలు చేయాలంటేనే.. ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితి.. ఇంటి నుంచి బయల్దేరినప్పటి నుంచి మళ్లీ ఇల్లు చేరే వరకు ఎన్నో సమస్యలు..
అలాంటిది రాజకీయాల్లోకి రావాలంటే మాములు విషయం కాదు. ఎన్నింటినో సహించాలి.. అర్థం లేని విమర్శలను ఎదుర్కోవాలి.. ఆఖరికి వాళ్ల క్యారెక్టర్‌నే టార్గెట్ చేస్తున్న మౌనంగా సహించాల్సి వస్తోంది.

Also Read: supriya shrinate : కంగనపై వివాదాస్పద కామెంట్స్.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్‌ షాక్‌..

ఎంతో ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు.. వీలైతే వారికి సపోర్ట్ చేయండి.. లేదంటే మౌనంగా ఉండండి.. అంతేకాని వారి క్యారెక్టర్‌ను అసాసిన్ చేయకండి. వారి మనసులు గాయపరిచేలా వ్యవహరించకండి.. ఏ పార్టీ నాయకులకైనా ఇదే రూల్ పాటించాల్సిందే.. మన ఇంట్లో ఆడవాళ్లు ఉంటారు. మనం ఒకరిని విమర్శిస్తే .. మన ఇంట్లో ఉండే వాళ్లను విమర్శించే వాళ్లు చాలా మంది ఉంటారు. కనీసం ఈ విషయాన్నైనా మనసులో పెట్టుకొని మెదిలితే మేలు..

నేతలు ఇకనైనా మారండి అంటూ ఎలక్షన్‌ షెడ్యూల్ విడుదల చేసిన రోజే హితబోధ చేసింది. ఈసీ ఇలాంటి సూచనలు చేసిందంటనే మీ స్థాయి దిగజారిపోయిందని అర్థం. మీ వ్యవహారశైలి ఎలా ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మాని.. మీరు సమాజానికి ఏం చేస్తారో చెప్పండి. అభివృద్ధికి రూట్ మ్యాప్ ఎలానో చూపించండి. ఇదే ప్రజలు మీ నుంచి ఆశించేది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News