Manchu Vishnu : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు హిట్ సినిమాలతో బిజీగా ఉన్న వర్మ గారు ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ గా మారారు. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న వర్మ ఇప్పుడు వివాదాలను సృష్టిస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటాడు. అయితే ఈయన ఏం మాట్లాడినా అదొక పెద్ద సంచలమే అవుతుంది. నిన్నటి వరకు శారీ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న ఆయన తాజాగా మంచు మోహన్ బాబును కలిసినట్లు తెలుస్తుంది. వీరిద్దరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మంచు విష్ణు. ఇది చూసిన నెటిజన్లో సడన్గా ఈ క్రిస్టి ఏంటి వీరిద్దరూ కలిసి ఉండడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో ప్రశ్నలు కురిపిస్తున్నారు. అసలు వీరిద్దరు ఎందుకు కలిశారు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మంచు మోహన్ బాబుతో ఆర్జీవి..
మంచు విష్ణు తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ ని షేర్ చేశారు ఆ పోస్టులో తన తండ్రి మంచు మోహన్ బాబు ( Mohan Babu) తో పాటు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ ఎప్పుడు కలిశారు ఎక్కడ కలిశారు అంటూ నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ ఫోటోను షేర్ చేయడంతో పాటు మంచు విష్ణు వారి పేర్ల మార్పుతో సరదాగా క్యాప్షన్ పెట్టారు. ఈ ఇద్దరితో ఈ సాయంత్రం వైల్డ్‌గా గడిచింది. మోహన్ బాబు వర్మ, మంచు రామ్ గోపాల్.. వీరిద్దరిలో పెద్ద రౌడీ ఎవరు?’ అని ఫ్యాన్స్‌ని ఆడుతున్నారు. మోహన్ బాబు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లోరౌడీ అనే సినిమాలో నటించాడు.. అలాగే మంచు విష్ణు కూడా అనుక్షణం అనే సినిమాలో నటించాడు ఆ సినిమాకు దర్శకుడు రాంగోపాల్ వర్మ. వీరిద్దరు అసలు ఎందుకు కలిశారో కూడా తెలియలేదు కానీ ఫోటో మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. మొన్నిమధ్య మంచి మోహన్ బాబు బర్త్డే సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా కూడా దీనిపై స్పష్టత రావాలంటే మంచు విష్ణు స్పందించే వరకు వెయిట్ చెయ్యాల్సిందే..
Also Read: బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే తప్పేంటి.. స్టార్ సింగర్
కన్నప్ప మూవీ..
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, శరత్‌కుమార్ తదితరులు ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.. ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో హీరో విష్ణు మంచు కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శివ భక్తుడుగా మంచు విష్ణు ఈ సినిమాలో కనిపిస్తాడు. అలాగే ప్రభాస్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భార్య అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇక సినిమా ఎలాంటి టాక్కుని అందుకుంటుందో చూడాలంటే ఏప్రిల్ 25 వరకు వెయిట్ చేయాల్సిందే..
This is a wild evening with the two OGs; Sri. Mohan Babu Varma and Sri Manchu Ram Gopal. Who is the bigger Rowdy? #OG #Rowdy pic.twitter.com/NHXZUndGzB
— Vishnu Manchu (@iVishnuManchu) March 24, 2025