Betting Apps Promotions: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ హీరోలు, నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో స్టార్ హీరోలు సైతం ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారికి పోలీసులు వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా ఈ కేసు పై ఓ స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
బెట్టింగ్ యాప్స్ కేసు..
బెట్టింగ్ యాప్స్ గురించి ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి యాప్స్ ని నమ్మి చాలా మంది డబ్బులను పెట్టి ప్రాణాలను పోగొట్టుకున్నారు. దాంతో ఈ యాప్స్ పై పోలీసులు కొరడా ఝలిపించారు. 11 మందిని పోలీసులు గుర్తించారు. కేసులు నమోదు చేశారు. కొందరు పోలీస్ స్టేషన్ మెట్లేక్కారు. మరికొందరు కోర్టు మెట్లేక్కారు. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కేసు పై ఓ ప్రముఖ సింగర్ సంచల వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
Also Read : రజినీకాంత్ నిజ స్వరూపం ఇదే.. నటి షాకింగ్ కామెంట్స్..
బెట్టింగ్ యాప్స్ కేసు పై సింగర్ రియాక్ట్..
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సెలబ్రిటీల తప్పేం లేదని అంటున్నాడు ఎస్పీ చరణ్.. సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో నటించిన ‘లైఫ్ – లవ్ యువర్ ఫాదర్’ అనే సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇంటికి వచ్చారు అందులో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్ కేసుపై చరణ్ స్పందిస్తూ.. నేనూ గ్యాంబ్లింగ్ చేశా. క్యాసినోకి వెళ్లి ఆడాను. కేవలం నేను సరదా కోసమే అడగను అదొక వ్యసనం లాగా ఆడలేదు అని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలను బాధ్యుల్ని చేయడం అనేది తనకు అర్థం కావడం లేదని ఎస్పీ చరణ్ అన్నారు.. సినిమా బ్రాండ్ నీ ప్రమోట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయితే ప్రమోట్ చేసిన వాళ్ళదే తప్పు అని ఎందుకంటారు నాకర్ధం కావట్లేదని ఎస్పీ చరణ్ అన్నారు. ఫ్రాడ్ చేసిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డ చరణ్.. సెలబ్రిటీలు ఏది చెప్తే అది ప్రజలు నమ్మొద్దని, స్వీయ విచక్షణతో మెలగాలని సూచించారు.. సెలబ్రిటీలు ఇలాంటి వాటిని ప్రమోట్ చేయకూడదని రూల్స్ ఏమి లేవు కదా డబ్బులు కోసమే మనం నటిస్తున్నాం అలాంటప్పుడు ఇలాంటివి చేస్తే డబ్బులు వస్తాయి అంటే ఎందుకు వదులుకోవాలి ఎవరు వదులుకోరు కదా అని ఆయన అన్నారు. వాళ్ళు చెప్పారు వీలు చెప్పారు మేము ఇలా యాప్స్ లో డబ్బులు పెట్టాము ఇప్పుడు లాస్ అయ్యాము అని వేరే వాళ్ళ మీద వేయడం కాదు దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత ఏదైనా చేయడం మంచిదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎస్పీ చరణ్ అన్న మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..