BigTV English

RGV – Poonam Pandey: ఆర్జీవీ రూటే సపరేటు.. పూనమ్ పాండేకు మద్దతు

RGV – Poonam Pandey: ఆర్జీవీ రూటే సపరేటు.. పూనమ్ పాండేకు మద్దతు

RGV – Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందిందనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఆమె మరణవార్తతో చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు. ఈలోపల ఆమె నుంచి ఓ వీడియో వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది. తాను బతికే ఉన్నానని.. తనకు ఎలాంటి గర్భాశయ క్యాన్సర్ రాలేదని ఆ వీడియోలో తెలిపింది. అంతేకాకుండా గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కోసమే ఇలాంటి పని చేయవలసి వచ్చిందని తెలిపింది.


దీంతో నెట్టింట పూనమ్‌పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. దేశం మొత్తం ఆమె చేసిన పనికి ఘోరంగా తిట్టిబోస్తున్నారు. చావుని కూడా వెటకారం చేసిందంటూ ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విమర్శల వాన కురుస్తోంది.

ఆమె ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. చావుని కూడా జనాల ఎటెన్షన్‌ కోసం వాడుకోవడం సరైన పద్దతి కాదని అంటున్నారు. ఇదే విషయమై తాజాగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు కూడా ఆమె చేసిన పనికి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పూనమ్ చనిపోయిందన్న వార్తతో ఎంతోమంది కన్నీటి పర్యంతమయ్యారని.. కానీ ఆమె రిలీజ్ చేసిన వీడియోతో ఇదంతా ఫేక్ అని తెలిసి వారంతా చాలా హర్ట్ అయ్యారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఇక దేశం మొత్తం ఆమెపై దుమ్మెత్తుపోస్తున్న సమయంలో.. ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మాత్రం పూనమ్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. అందరూ ఒకవైపు అయితే.. తానొక్కడు ఒకవైపు అన్నట్టుగా ఉంటాడు. అందువల్లనే దేశం మొత్తం ఆమెను తిడుతున్నా.. ఆయన మాత్రం ఆమె చేసిన పనికి వత్తాసు పలకాడు.

సెర్త్వెకల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ పాండే ఎంచుకున్న విధానం తనకు ఎంతగానో నచ్చిందని అన్నాడు. ఆమె ప్రయత్నం విమర్శల పాలైనప్పటికీ.. ఆమె ఉద్దేశాన్ని ఎవ్వరూ తప్పుబట్టరని తెలిపాడు. ఆమె జీవితాంతం సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×