BigTV English

USA: హూతీ క్షిపణి ధ్వంసం.. ప్రకటించిన అమెరికా సెంట్రల్ కమాండ్..

USA: ప్రయోగానికి సిద్ధం చేసిన హూతీ క్షిపణిని తాము ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్ ఆదివారం‌ ఎక్స్ వేదికగా ప్రకటించింది.

USA: హూతీ క్షిపణి ధ్వంసం.. ప్రకటించిన అమెరికా సెంట్రల్ కమాండ్..

USA: ప్రయోగానికి సిద్ధం చేసిన హూతీ క్షిపణిని తాము ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్ ఆదివారం‌ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఆత్మరక్షణ నిమిత్తం శనివారం రాత్రి యెమెన్‌పై అమెరికా-యూకే వైమానిక సంస్థ దాడి చేసింది తెలిసిందే. ఈ సమయంలో ఎర్ర సముద్రంలో నౌకలపై దాడికి హూతీలు యాంటీ షిప్‌ మిసైల్‌ను సిద్ధం చేశారు. దీనిని అమెరికా దళాలు ధ్వంసం చేశాయి.


అమెరికా, యూకేకు చెందిన టైఫూన్‌ యుద్ధ విమానాలు, ఎఫ్‌-18ఎస్‌లు మొత్తం 13 ప్రదేశాల్లోని 30 లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించినట్లు సెంట్ కామ్ పేర్కొంది. బంకర్లను ధ్వంసం చేసే బాంబులు కూడా వాడినట్లు పేర్కొంది.

మరోవైపు అమెరికా దాడులు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఆటంకంగా మారాయని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధికి శనివారం ఇరాన్‌ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సెయిన్‌ అమీర్‌ మాట్లాడుతూ అమెరికా దాడులు, హూతీలను ఉగ్రవాదులుగా ప్రకటించడం వంటి చర్యలు పరిస్థితిని కఠినతరంగా మారుస్తున్నాయన్నారు. బలప్రయోగంతో సమస్యలు పరిష్కరించాలనే అమెరికా వైఖరి ఫలితం ఇవ్వదని అన్నారు. ఆయన ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికా-బ్రిటన్‌ దళాలు యెమెన్‌పై మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడ్డాయి.


మరోవైపు హూతీల ప్రతినిధి ఎక్స్‌లో స్పందిస్తూ అమెరికా-యూకే బాంబింగ్‌ మా వైఖరిని మార్చలేవని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మా ఆపరేషన్లు కొనసాగుతాయన్నారు. గాజాకు స్వేచ్ఛ లభిస్తేనే ఇవి ఆగుతాయని పేర్కొన్నారు. ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోమని అని పేర్కొన్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×