BigTV English

Team India : గెలుపా? ఓటమా?.. చరిత్ర ఏం చెబుతోంది?

Team India : గెలుపా? ఓటమా?.. చరిత్ర ఏం చెబుతోంది?
Team india Latest sports News

Team India Latest sports News : విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ నిర్దేశించిన లక్ష్యం.. 399 పరుగులు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 14 ఓవర్లలో 67 పరుగులు చేసింది. ఓవర్ కి యావరేజ్ న 5 పరుగుల చోప్పున చేసింది. అంటే బజ్ బాల్ వ్యూహం అమలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. మరి ఇలా ఆడితే, ఇంత భారీ టార్గెట్ ను ఛేదిస్తుందా? అనే సందేహాలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి.


చరిత్రలోకి చూస్తే, ఇప్పటివరకు ఏ జట్టు ఆసియాలో ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించినట్లు లేదు. 2021లో బంగ్లాదేశ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాపై వెస్టిండీస్ సాధించిన 395 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం టీమ్ ఇండియా 399 పరుగులు చేసింది కాబట్టి,  4 పరుగుల ఆధిక్యంలో ఉంది.

భారత్‌లో చూస్తే పర్యాటక జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన అత్యధిక పరుగులు 299 మాత్రమే. ఇంగ్లండ్ విషయానికొస్తే ఆ జట్టు అత్యధిక స్కోరు 241 పరుగులుగానే కనిపిస్తున్నాయి. నెట్టింట వీటిని చూపిస్తూ ఇండియాదే విజయం అని నెటిజన్లు కోట్ చేస్తున్నారు. కాకపోతే ఇంగ్లాండ్ స్పీడ్ చూస్తుంటే ఎటాకింగ్ మోడ్ లోనే ఆడుతున్నారు. విజయమో, వీర స్వర్గమో అన్నట్టే కనిపిస్తున్నారు.


కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఇక అంతా ఆధారపడి ఉంది. బౌలర్స్ వేసే బంతులకు తగినట్టుగా ఫీల్డింగ్ మొహరించాలి. అలాగే తను షార్ట్ టెంపర్ కి గురికాకూడదు. గ్రౌండ్ లో ప్లేయర్లను బూతులు తిడుతున్నాడనే విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనివల్ల కెప్టెన్ పై టీమ్ సభ్యులకి విశ్వాసం పోతుంది. అంతేకాదు గౌరవం కూడా ఇవ్వరు. ఇది ఓవరాల్ గా జట్టుపై ప్రభావం చూపిస్తుందని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

ముఖ్యంగా పేసర్ ముఖేష్ కుమార్ బాగా దొరికేస్తున్నాడు. తన బౌలింగ్ నే ఇంగ్లాండ్ బ్యాటర్లు టార్గెట్ చేసుకుని రన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బుమ్రాని గౌరవిస్తున్నారు. ముఖేష్ ని వాయించేస్తున్నారు. 

తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా సాధించని అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ తీసి, ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు.రేపటి మ్యాచ్ లో కూడా ఇలాగే తన చేతుల మీదే ముగింపు పలికి, సిరీస్ ను సమం చేయాలని ఆశిస్తున్నారు. 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×