BigTV English

Ram Gopal Varma Post: కావాలని కెలుక్కోవడం కాకపోతే.. పవన్ తో ఎందుకయ్యా నీకు?

Ram Gopal Varma Post: కావాలని కెలుక్కోవడం కాకపోతే.. పవన్ తో ఎందుకయ్యా నీకు?

Ram Gopal Varma Criticize Pawan Kalyan in Social Media: ఎవరైనా వివాదాలు అంటే ఆమడ దూరం పరిగెడతారు. కానీ, రామ్ గోపాల్ వర్మ మాత్రం వివాదాలు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అంటాడు. అసలు కావాలని వివాదాలు కొనితెచ్చుకోవడంలో వర్మ సిద్ధహస్తుడు. ఒకప్పుడు ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాలు తీసిన డైరెక్టర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిచేత చీవాట్లు తింటున్నాడు. ఎలక్షన్స్ రావడం ఆలస్యం.. ఏదో ఒక బయోపిక్ తీయడం.. దానిపై పెద్ద చర్చ.. వివాదం. గత కొన్నేళ్లుగా వర్మ ఇదే పంథాను కొనసాగిస్తున్నాడు.


ఇక ఏపీ ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉన్నాయి అన్నప్పటి నుంచి టీడీపీ- జనసేనను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, విమర్శించడం చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా పవన్ ను ఏదో ఒక మాట అనడం.. అతని ఫ్యాన్స్ తో తిట్టించుకోవడం వర్మకు కామన్ గా మారిపోయింది. గత కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్న వర్మ.. తాజాగా మరోసారి పవన్ ను కెలికాడు. నిన్న నామినేషన్ వేసేముందు పవన్ ప్రచారంలో భాగంగా ఒక బ్రాహ్మణుడి సైకిల్ ను తొక్కాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఇప్పుడు ఆ ఫొటోకు.. తాను ఇంటర్మీడియట్ లో సైకిల్ తొక్కుతున్న ఫోటోను జత చేసి.. “పైన సైకిల్ మీద ఉన్న వ్యక్తిని నేనే. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తీసుకున్నాను. కింద సైకిల్ తొక్కుతున్నది ఎవరో నాకు తెలియదు. రెండు ఫొటోల్లో కామన్ గా ఉన్నది మాత్రం సైకిల్.. జై టీడీపీ” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటో చూసి పవన్ ఫ్యాన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. కావాలని కెలుక్కోవడం కాకపోతే.. పవన్ తో ఎందుకయ్యా నీకు.. ? అని కొందరు.. ఉన్నాకొద్దీ ఆర్జీవీ చాలా చీప్ అయిపోతున్నాడు అని ఇంకొందరు.. సినిమా తీస్తే పవన్ తో తీస్తానని చెప్పి.. ఇప్పుడు ఎవరు అంటున్నావా..? అని కామెంట్స్ పెడుతున్నారు.


Also Read: Renu Desai: ఆ పార్టీకే నా సపోర్ట్.. డబ్బు తీసుకోకుండా చెప్తున్నా.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×