E-Paper
Advertisement

Double Ismart : డబుల్ స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ డబ్బింగ్ పూర్తి.. వీడియో షేర్ చేసిన రామ్

Double Ismart : డబుల్ స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ డబ్బింగ్ పూర్తి.. వీడియో షేర్ చేసిన రామ్
Advertisement

Double Ismart movie updates(Latest news in Tollywood): చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్ పోతినేని ని మాస్ హీరోగా మార్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ లో ఉన్న మాస్ యాంగిల్ ను ఫ్యాన్స్ కు చూపించి.. పూనకాలు తెప్పించాడు పూరి. అప్పట్నుంచీ చాక్లెట్ బాయ్ రామ్ కాస్తా.. ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. పక్కా తెలంగాణ యాసతో.. ఆ సినిమాలో రామ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చాడు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లోనే వస్తోన్న సినిమా.. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్.. డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ క్యారెక్టర్ పోషించాడు.

తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చాడు రామ్. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న విడుదలకు సిద్దమవుతుండగా.. డబుల్ స్పీడ్ లో డబ్బింగ్ ను పూర్తి చేశాడు. డబ్బింగ్ సెషన్ వీడియోలో రామ్ చెప్పిన ఒక డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మామ మాస్క్ ఉంటే నీకు దొంగడు మాత్రమే కనపడతడు.. మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడతడు” అనే డైలాగ్ రామ్ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తోంది.

Advertisement

Also Read : మాజీ విశ్వసుందరి.. మాజీ సీఎం మనవడితో డేటింగ్‌

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై.. పూరి జగన్నాథ్, నటి ఛార్మీ కౌర్ కలిసి ఈ సినిమాను నిర్మించగా.. రామ్ సరసన కావ్య థాపర్ నటించింది. ఇక మణిశర్మ సంగీత బాణీలు అందించాడు. శ్యామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ చేశారు. తెలుగు, తమిళనం, కన్నడ, మలయాళం, హిందీ.. మొత్తం 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా హిట్టైతే.. కలెక్షన్ల వర్షం కురవడం కన్ఫర్మ్.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×