BigTV English

Ex Miss Universe Manushi chhillar dating: మాజీ విశ్వసుందరి.. మాజీ సీఎం మనవడితో డేటింగ్‌

Ex Miss Universe Manushi chhillar dating: మాజీ విశ్వసుందరి.. మాజీ సీఎం మనవడితో డేటింగ్‌

Ex Miss Universe Manushi chhillar dating: మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరంలేదు. సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న ఈమె.. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ తెచ్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా తన మార్క్ చూపించ లేకపోతోంది. తాజాగా ఈమె గురించి ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. మాజీ సీఎం మనవడితో మానుషి డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి.


27 ఏళ్ల మానుషి చిల్లర్ సొంతూరు హర్యానా. ఏడేళ్ల కిందట విశ్వసుందరిగా నిలిచింది. ఆ తర్వాత అంచెలంచెలుగా గ్లామర్ ఇండస్ట్రీపై దృష్టిపెట్టింది. ఆ తర్వాత ఐదేళ్లకి బాలీవుడ్‌లో నటించింది. తొలి చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్. మరుసటి ఏడాది ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడేమియా ఛోటే మియా వంటి సినిమాలు చేసింది. కానీ తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోలేకపోయింది.

అసలు మేటర్‌కి వచ్చేద్దాం.. మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ ప్రస్తుతం బిజీగా ఉందని బీటౌన్‌లో వార్త లు జోరందుకున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌షిండే మనవడు వీర్ పహారియాతో డేటింగ్‌లో ఉన్నట్లు ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. వీర్ పహారియా నటుడిగా రాణిస్తున్నాడు. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, ఈ మధ్యకాలం చాలా ఫంక్షన్‌లో వీరిద్దరు జంటగా కనిపిస్తున్నార నేది దాని సారాంశం.


ALSO READ:  కియారా బర్త్‌డే కానుక.. ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ నుంచి స్పెషల్‌ పోస్టర్ రిలీజ్

అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో మానుషి-వీర్ పహారియా కలిసి డ్యాన్స్ చేశారు. అప్పటి నుంచి ఈ గాసిప్స్ కు మరింత బలం చేకూరింది. దీనికితోడు బాలీవుడ్ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓరీ ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో మానుషి-వీర్ కనిపించారు. అంతేకాదు వీర్‌తో రిలాక్స్ అవుతూ కని పించడం వైరల్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు రూమర్లు గుప్పుమన్నాయి. ఆ వీడియో చూసి చాలామంది షాకయ్యారు. వీరిద్దరి గురించి వార్తలు జోరందుకున్నాయి. కానీ నోరు మాత్రం మెదపడంలేదు.

ఇదేకాదు గతంలో మానుషి బిజినెస్‌మేన్ నిఖిల్‌కామత్‌తో డేటింగ్ చేసింది. అయితే ఇరు ఫ్యామిలీలు సన్నిహితంగా ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దరు కలిసి తరచుగా ట్రావెలింగ్ చేసేవారు. రుషికేష్‌ను సందర్శించారు. అంతేకాదు ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా ఖతార్‌లోని లుసైల్ స్టేడియం వద్ద దర్శనమిచ్చారు. ఆ తర్వాత వీరి యవ్వారం మరుగునపడిపోయింది. ఇప్పుడు వీర్ వంతైంది. రాబోయే రోజుల్లో ఈ జంట గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×