BigTV English

Telangana Assembly: పదేళ్లు చేయలేనిది..పదినెలల్లో చేయమనడం సరికాదు..సీఎం రేవంత్ రెడ్డి

Telangana Assembly: పదేళ్లు చేయలేనిది..పదినెలల్లో చేయమనడం సరికాదు..సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy In Assembly Session: బీఆర్ఎస్ పాలన అనుభవాలతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు చేయలేనిది.. మేము పదినెలల్లో చేయమనడం సరికాదన్నారు. సభను తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించడానికి చూస్తున్నారన్నారు. పాలసీలను మార్చిన ఘనత బీఆర్ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు.


నేత కార్మికులకు బకాయిలు పెట్టింది ఎవరు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బతుకమ్మ చీరలను సూరత్‌లో ఎందుకు కొనాల్సి వచ్చిందని, సూరత్ చీరలతో పేదలను మోసం చేయాలని అనుకున్నార్నారు. అందుకే బీఆర్ఎస్ ఇచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు తిరస్కరించారన్నారు. అలాగే బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్టు ఇచ్చారా? లేదా? అన్నారు. ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్ ఎందుకు పొడిగించలేదని, కేంద్రం నిర్మిస్తామంటే..తిరస్కరించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ? అన్నారు.

ఫార్మాసిటీలో ఏ మేరకు భూ సేకరణ జరిగిందో మా వద్ద డేటా ఉందన్నారు. అలాగే గత ప్రభుత్వం క్రీడలను విస్మరించిందని, అందుకే యువతను ప్రోత్సహించాలనే మహ్మద్ సిరాజ్ కు ఉద్యోగం ఇచ్చామన్నారు. మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారని, పదినెలలు పూర్తికాని మా పాలనపై వందల ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజకీయ కోణంలో విషం చిమ్మడం తప్పా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా సూచనలు చేశారా అని పశ్నించారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మొదళ్లలో చొప్పిస్తున్నారన్నారు.


Also Read: అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై వాడీవేడిగా చర్చ..కేటీఆర్‌పై సీతక్క ఫైర్!

నేను పొరుగు రాష్ట్రంలో చదవలేదని, ఇక్కడే అన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో చదివానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 610 జీఓలో ఉద్యోగానికి అర్హత ఉందో లేదో చూడాలన్నారు. సూరత్ చీరలపై చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. అధికారుల పేరు కోట్ చేయడం ఎంతవరకు కరెక్టో పెద్ద చదువులు చదివిన వారికే తెలియాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×