BigTV English

Doubleismart: బ్రేకింగ్.. పుష్ప వాయిదా.. ఆ డేట్ ను లాక్ చేసిన ఇస్మార్ట్ రామ్

Doubleismart: బ్రేకింగ్.. పుష్ప వాయిదా.. ఆ డేట్ ను లాక్ చేసిన ఇస్మార్ట్ రామ్

Doubleismart: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఇండస్ట్రీ మొత్తం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తున్నారు.అందుకు తగ్గ ప్లాన్స్ కూడా చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో బన్నీ ఫ్యాన్స్ కు చేదు వార్త అందింది. పుష్ప 2 వాయిదా పడిందని తెలుస్తోంది. సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో సుకుమార్ కొంచెం టైమ్ తీసుకోవాలని భావిస్తున్నాడట. అందుకే పుష్ప 2 వాయిదా పడింది. ఇక ఆగస్టులో కనుక రాకపోతే పుష్ప 2 ను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. దీంతో పుష్ప 2 డేట్ ను రామ్ లాగేసుకున్నాడు.

రామ్ పోతినేని – పూరి కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మీ- పూరి కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. ఎప్పటినుంచో డబుల్ ఇస్మార్ట్ ఒక మంచి డేట్ ను లాక్ చేయడానికి చూస్తోంది.


ఇక ఇప్పుడు పుష్ప 2 వాయిదా అని తెలియడంతో నిమిషం కూడా ఆలోచించకుండా ఆ డేట్ ను కబ్జా చేసేశాడు రామ్. ఈ విషయాన్ని రామ్ అధికారికంగా తెలిపాడు. మామా డేట్ లాక్ కరో అంటూ కొత్త పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ను తెలిపాడు. ఇప్పటివరకు పుష్ప 2 వాయిదా అని రూమర్స్ మాత్రమే వచ్చాయి.. అధికారికం కాదు కదా అనుకున్నారు. కానీ, డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. మరి పుష్ప 2 వాయిదా అని మేకర్స్ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×