RAPO 22 Shooting Update : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో రామ్ పోతినేని ఒకరు. దేవదాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. నేను విభిన్నమైన సినిమాలను చూస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో రామ్ పోతినేని హిట్ సినిమా చూసి చాలా రోజులు అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ కెరియర్ లో ఇప్పటివరకు హిట్ సినిమా రాలేదు. కేవలం రామ కెరియర్ లో మాత్రమే కాకుండా పూరి జగన్నాథ్ కెరీర్లు కూడా హిట్ సినిమా పడలేదు. ప్రస్తుతం రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
RAPO22
రామ్ కెరియర్ లో వస్తున్న 22 సినిమా ఇది. అందుకని #RAPO22ను వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేసింది RAPO22 యూనిట్. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా ఇంపార్టెంట్ టాకీ సీన్స్ షూటింగ్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం చెబుతోంది.
రాజమండ్రిలో జరిగిన చిత్రీకరణలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సహా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ పాల్గొన్నారు.
హైదరాబాదులోనే షూటింగ్
మార్చి 28వ తేదీ నుంచి హైదరాబాద్ షెడ్యూల్ మొదలైంది. ఇక కంటిన్యూస్ గా మే 4వ తారీఖు వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. అయితే మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రామ్ కెరియర్ లో లవ్ స్టోరీ సినిమా వచ్చి చాలా రోజులు అయింది. ప్రాపర్ గా రామ్ ఒక లవ్ స్టోరీ సినిమా చేస్తే చూడడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఒక ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Nani: ఇందుకే నాని ను ఇష్టపడేది, కేరళ అభిమాని భావోద్వేగం