BigTV English

Nani: ఇందుకే నాని ను ఇష్టపడేది, కేరళ అభిమాని భావోద్వేగం

Nani: ఇందుకే నాని ను ఇష్టపడేది, కేరళ అభిమాని భావోద్వేగం

Nani: నాచురల్ స్టార్ నాని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ మొదలుపెట్టాడు కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్ కష్టమేంటో తనకి తెలుసు. ఒక దర్శకుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు నానికి ఒక దర్శకుడుగా కూడా ఐడియా ఉంది. అయితే నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన తర్వాత తను కథ చెప్పిన ఏకైక హీరో అల్లు అర్జున్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టాచమ్మా సినిమాతో నాని నటుడుగా మారిపోయాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ హీరో అయిపోయాడు. కేవలం సినిమాల్లోనే హీరో మాత్రమే కాకుండా, బయట కూడా నిజమైన హీరో అని అనిపించుకుంటున్నాడు. ఇండస్ట్రీలో జన్యున్ గా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫారం ఇస్తున్నాడు.


నిర్మాతగా కూడా

ఇక నా నీ నటుడుగా మాత్రమే సినిమాలు చేయకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను హీరోగా సినిమాలు చేస్తూ శ్రీకాంత్ ఓదెల, శౌర్యవ్ వంటి దర్శకులని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు. కేవలం వాళ్లతో సినిమాలు చేయడం మాత్రమే కాకుండా వాళ్లతో అవార్డ్స్ కూడా కొట్టించగలిగేలా చేశాడు. ఇక ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించాయి. నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను అనే దర్శకుడిని నాని పరిచయం చేశాడు, ప్రశాంత్ వర్మ ని కూడా నాని పరిచయం చేశాడు. ఇక కోర్ట్ అనే సినిమాతో రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుని పరిచయం చేశాడు. అందుకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నానిని చాలామంది ఇష్టపడుతుంటారు.


కేరళ కుర్రోడి భావోద్వేగం

నాని హిట్ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో, ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కేరళ ప్రమోషన్స్ లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. నానిని ఒక వ్యక్తి మీరు నా కథ వింటారా అని అడిగాడు తప్పకుండా మీ దగ్గర సినాప్సిస్ ఉందా అని అడిగారు. అయితే ఆ కుర్రాడు తీసుకొచ్చిన సినాప్సిస్ ను చేతిలోకి తీసుకొని, నేను కచ్చితంగా ఈరోజు దీనిని నేను చదువుతాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ కుర్రవాడిని హత్తుకుని మీ హార్ట్ బీట్ నాకు తెలుస్తుంది. నేను అవకాశం నీకోసమే కాదు నా కోసమైనా ఇస్తాను అంటే చెప్పుకొచ్చాడు. నేను కాకపోయినా కూడా ఇదే ప్యాషన్ తో నువ్వు ట్రై చేస్తూ ఉండు ఏదో ఒక రోజు నువ్వు మంచి డైరెక్టర్ అవుతావంటూ నాని ఆ అబ్బాయికి భరోసా ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Vijaya Shanthi : లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ నాది, కానీ కొంతమంది తీసేసుకున్నారు

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×