BigTV English

Ranbir Kapoor : ఆ వేడుకలో” జైమాతా ది” నినాదాలు .. రణ్ బీర్ వీడియో వైరల్.. హిందూ సంఘాల ఆగ్రహం..

Ranbir Kapoor : ఆ వేడుకలో” జైమాతా ది” నినాదాలు .. రణ్ బీర్ వీడియో వైరల్.. హిందూ సంఘాల ఆగ్రహం..
Ranbir Kapoor latest news

Ranbir Kapoor latest news(Bollywood news today):

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఇటీవల విడుదలైన యానిమల్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ నాడు రణబీర్ కపూర్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుక జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి “జై మాతా ది “అని రణబీర్ చేసిన కామెంట్ అతన్ని చిక్కుల్లో పడేసింది . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది .


సాధారణంగా హిందువులు ఏదైనా పూజ చేసేటప్పుడు అగ్నికి ముందుగా ప్రార్ధించి అనంతరం పూజను ప్రారంభిస్తారు . కాగా రణబీర్ ,అతని కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో మద్యాన్ని ఉపయోగించి జై మాతా ది అని నినాదాలు చేశారని విమర్శలొచ్చాయి. ఈ వీడియో కొంతమంది మండిపడ్డారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా రణబీర్ ప్రవర్తించారని అంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు ఈ యానిమల్ హీరో.

ఈ వీడియో దుమారం రేపుతుండగా .. ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్ లో సంజయ్ తివారీ అనే వ్యక్తి తన న్యాయవాదులు ఆశిష్ రాయ్ , పంకజ్ మిశ్రా ద్వారా రణబీర్ , అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. రణబీర్ కపూర్ “జై మాతా ది “అని చెప్పగానే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా జై మాతా ది అన్నట్టు సంజయ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు . అతనికి హిందూ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ఇప్పుడు రణ్ బీర్ వీడియోపై పెద్ద దుమారం రేగుతోంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×