
Animal Movie : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మీక నటించిన ‘యానిమల్’ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ అవైటెడ్ మూవీ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే అయినా.. ఆయనకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మంచి మార్కులు కొట్టేశాడు సందీప్ వంగా. దీంతో రాబోయే సినిమాపై ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు చిత్రం పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచాయి. విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పై కూడా భారీగా ఫోకస్ చేసింది. రీసెంట్ గా వీళ్ళు బాలయ్య మోస్ట్ పాపులర్ టాక్ షో అన్ స్టాపబుల్ కి వచ్చి సందడి చేశారు. హీరో రణబీర్ కపూర్.. హీరోయిన్ రష్మిక తో కలిసి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. బాలయ్య టాక్ షోలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇటీవల దుబాయ్ లో బాగా ఫేమస్ అయిన బుర్జ్ ఖలీఫాపై ‘యానిమల్’ టీజర్ ను ప్లే చేశారు.
రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్, నిర్మాత భూషణ్ కుమార్ మూవీ ప్రమోషన్ నిమిత్తం దుబాయ్ చేరుకున్నారు. రీసెంట్ గా ఈ మూవీ మాన్‌హాటన్ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ పై టెలికాస్ట్ అవడంతో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏకంగా బుర్జ్ ఖలీఫా పై ప్రత్యేక ప్రదర్శన తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ విడుదల కౌంట్ డౌన్ మొదలయింది. ఈ ఎలక్ట్రిఫైయింగ్ మూవీ కోసం.. ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఎన్నడూ లేనంత ఆసక్తి నెలకొంది. యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కాబోతుంది.