BigTV English

Animal Movie Trailer : యాక్షన్.. సెంటిమెంట్.. అంచనాలు పెంచిన ‘యానిమల్‌’ ట్రైలర్‌..

Animal Movie Trailer :  యాక్షన్.. సెంటిమెంట్.. అంచనాలు పెంచిన ‘యానిమల్‌’ ట్రైలర్‌..
Animal Movie Trailer

Animal Movie Trailer : అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్న క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..త్వరలో యానిమల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఈ మూవీ డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదల అయింది.


యానిమల్ మూవీ ట్రెయిలర్.. ఫుల్ పవర్ ప్యాకెడ్ గా ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు. ఈ ట్రైలర్ చూసి ఒక్కసారిగా అందరి మైండ్ బ్లాక్ అయింది. వైలెన్స్ , సెంటిమెంట్ ఓకే ట్రైలర్ లో బ్యాలెన్స్ చేస్తూ ఎంతో అద్భుతంగా చూపించారు. తండ్రిని చంపాలి అనుకున్న వాళ్ళపై కొడుకు ఆవేశం ..తన కోసం పోరాడే కొడుకు పట్ల తండ్రి ఆవేదన.. ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఇక ఈ మూవీలో యాక్షన్ కి ఎటువంటి లోటు లేదు అన్న విషయాన్ని కూడా ట్రైలర్ తో డైరెక్టర్ స్పష్టంగా చెప్పాడు. ట్రైలర్ లో ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి .ట్రైలర్ లోనే ఈ రేంజ్ బీభత్సం సృష్టించాడు అంటే మూవీలో ఫైట్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటున్నారు నెటిజన్స్. చిన్నతనంలో తండ్రి నిర్లక్ష్యానికి గురి అయిన కొడుకు పెరిగి పెద్దయ్యాక ఎలా మారాడు.. తన తండ్రిని కాపాడుకోవడానికి ఫుల్ యానిమల్ మోడ్ లోకి ఎందుకు వచ్చాడు.. అన్న విషయం మిగిలిన కథ .తండ్రి కొడుకుల మధ్య బలమైన బాండింగ్ తో ఈ మూవీ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకు బాలీవుడ్ లో లవర్ బాయ్.. చాక్లెట్ బాయ్ గా ఆద్యంతం అందర్నీ ఆకట్టుకున్న రణబీర్ కపూర్ ఈ మూవీలో ఫుల్ స్వింగ్ యాక్షన్ మోడ్లో కనిపిస్తాడు. రష్మీక తన పాత్ర మేర అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించారు.

ఇప్పటివరకు మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ,పోస్టర్స్ మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి .అయితే లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ మాత్రం మూవీ పై అంచనాలను భారీగా పెంచింది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×